పుట:Raajasthaana-Kathaavali.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

రాజస్థానకధావళి.


టకుఁ దన యిరువురకుమారులఁ దారా యౌరంగజీబులను వారిని తండ్రి వద్దకు జామీనులుగఁ బంపెను. మహబత్థానుఁడు పేరు తురక పేరు పెట్టుకొన్నను కులమున రాజపుత్రుఁడే. అట్లగుటచే నతఁడు షాజహానుని విధమునఁ జక్రవతి౯కి లోఁబడక సంధికంటె సాహసమే లెస్స యని నిశ్చయించి సూక్తవతులు మొదలగు కొండఱు రాజపుత్రుల సహాయముగఁ బడసి 'యే రాజపుత్రుఁడు నేన్నఁడు కలలోనయినఁ జేయఁదలఁపని యొక మహా సాహసమును గావించెను. కుమారుఁడు లోఁబడిన పిదప మహబత్ఖాను ఱెక్కలు తెగిన పక్షి విధమున నొంటిగాఁ డయి యున్న వాఁడని గ్రహించి జహంగీరు వానిపయి ధనాపహరణము జనపీడనము నను రెండు నేరములు మోపి తన యెదుటికి వచ్చి యా నేరముల కుత్తరము చెప్పుమని వాని కాజ్జాపించెను. ఎందునిమిత్తము చక్రవతి౯ తన్ను రమ్మనియెనో యాసంగతి పూతి౯గ నెఱిఁగినవాఁ డుగావున వెళ్ళుట కిష్టము లేక ఇదిగో అదిగో యని కొన్ని నాళ్లు జరపెను. సత్వరముగ రాక తప్పదని చక్రవతి౯ పట్టుపట్టెను. అటుమీద నోకనాఁడు మహబతుఖానుఁ డైదువేల రాజపుత్ర పరివారముతో వచ్చి శిబిరము జేరినాఁడని చక్రవతి౯కిఁ దెలిసెను. ఆసమయమున జహంగీరు కార్యాంతరముమీఁద కాబూలు నగరమునకుఁ బోవుచు సింధునది కుపనదియయిన జీలమును దాఁట బ్రయత్నించెను. సేనయం తయు ముందు నదిదాటి యావలి యొడ్డు జేరెను. చక్రవతి౯ నూర్జహాను వారిపరి వారములు మాత్ర మీవలియొడ్డున గుడారములోనుండి సందడి తగ్గినతోడనే యేరు దాటఁ దలపోయుయు చుండిరి. అప్పుడే తెల్లవారుచుండెను. నూర్జహాను తక్కినయతః పురాంగనలతోఁ గలసి యొక గుడారమున నుండెను, చక్రవతి౯ రాత్రి తాగిన సారాయముల యొక్క నిషాయింకను దిగనందున నొడలు మరచి యుండెను.

అంతలో మనుష్యులయడుగుల యలుకుడు చేతులలలోని యా యుధముల చప్పుడులు వాని చెవులకు వినంబడ చక్రవర్తి యులికిపడి