పుట:Raajasthaana-Kathaavali.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీకిని, మీవారునకును సంధి

193


డగు భీమునితోడను, వానిచుట్టము చెలికాఁడు సూక్తవతువంశస్థుఁడు నగు మానసింగుతోడను గట్టియాలోచన చేయసాగెను. ఆకుట్రలపడి యెఱింగి చక్రవర్తి యామిత్రుల నొకచోఁ గలసి యుండనిచ్చినచోఁ బ్రమాదము వాటిల్లునని భీముని గుజరాతీ దేశమునకుఁ బాలకునిఁ జేయుమిషతో నక్కడకుఁ బొమ్మనీ యజ్ఞాపించెను. ఈ యుద్యోగము తనకక్కర లేదని నిర్భయముగఁ జెప్పి యక్కడకుఁ బోనని రాజపుత్ర సాహస మంతయు మూతీ౯ భవించిన ట్లతఁడు ప్రత్యుత్తర మిచ్చెను. అంతవఱకు వచ్చిన తరువాత నూరకున్నచోఁ దన ప్రాణము మీఁదికి వచ్చునని భయపడి షాజహాను తండ్రితోఁ బ్రత్యక్ష వైరము బూనెను. అత్తఱి భీముఁడు మానసింగు మొదలగు సూక్త వతులు, చక్రవర్తి సర్వ సేనాధిపతి యగు మహబతుఖానుఁడును పొజహానుతోఁ జేరిరి. ఈనడుమ నతిక్రూరుఁడని పేరు వహించి జనవిరోధి యయి యున్న పార్విజు నెవరో చంపి వేసిరి.

జహంగీరు మహాసేనాసమేతుఁడయి తనపై ధ్వజమెత్తిన కొడుకును దండించుటకు బయలు దేరెను. షాజహాను నెంతో యంతఃకణర శుద్ధియు దయాస్వభావము గలవాఁ డగుటచే రాజపుత్రులు వానిపై నభిమానము గలిగి తత్పక్షముఁ జేరఁ జొచ్చిరి. షాజహాను తల్లి మార్వారు దేశపు రాజసింగు యోక్క కూతురు. ఈకుటుంబకలహము నందు వృద్దుఁడగు గజసింగు తన యల్లుని పక్షము వచ్చునా మనుమని పక్షము వచ్చునా యని లోకులు సందియము పడి దాని పరియవసానము బ్రతిక్షించు చుండిరి.

ఎట్లయిన లోకానుభవముగల గజసింగు దూరమాలోచించిన రహతూరుబలముతోఁ గూడి చక్రవతి౯ పక్షమునకే వచ్చెను. అప్పుడు జహంగీరు మితిమీరిన యానందము నొంది సామంత రాజ మండలము నెదుట మామగారి చేయి పట్టుకొని ముద్దు పెట్టుకొని వానిని గౌరవించెను. అప్పుడు కొడుకును దండ్రియు గాశీ పట్టణమువద్ద యువ