పుట:Raajasthaana-Kathaavali.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

రాజస్థానకధావళి.


రారాజులకయిన మానములు దక్కని ఢిల్లీశ్వరుని దర్బారులో నొక్క నాఁడయిన నవమానమందక యేపనిఁ జేసిన బుద్ధికుశలతఁ జూపి చేయుచు ఢిల్లీకి లోఁబడి యే వెలితి లేకుండ నేలెను.

జహంగీరునకు మీవారు రాణాలమీఁద నెందుచేతనో యత్యంతాభిమానము గలిగెను. రాణాకుమారునిఁ జక్రవతి౯ తనపక్కన పీఠము వేయించి కూర్చుండఁ బెట్టు కొనును. ఈరాణాబంధువులను తక్కిన రాజుల బంధువులకంటే నెక్కుడుగ గౌరవించును. జహంగీరు పుత్రుండగు షాజహానునకును రాణాతమ్ముఁడగు భీమునకును గాటముగా మైత్రి యయ్యెను. ఈ భీముఁడు రాణా చక్రవతి౯కి గానుకగా బంపు సేనకధిపతియయి దర్బారులోనే యుండు వాఁడు. అందుచేత షాజహాను దానియందలి స్నేహంబు పెంపున తండ్రితోఁ జెప్పి భీమునకు రాజబిరుదమిప్పించి యంతతోఁబోక లోడాయను చిన్న జిల్లాకు వానిని రాజుగ, జేయించి బహువిధముల గౌరవించెను. జహంగీరు కొడుకు ప్రేరణంబున భీమున కనేకోపకారములఁ జేసిన కొన్ని నాళ్ళకె యేల మేలు చేసితినని విచారింపఁజొచ్చేను.

జహంగీరునకు నలుగురు కొడులు, అందు జేష్ఠుఁడు ఖుస్రూ యను వాఁడు తండ్రి నెదిరించి పట్టువడి, బధింపబడి తుదకు చెరసాల లోనే మృతినొందెను. రెండవ వాఁడు షాజహను. ఇతని మీఁద జహాంగీరు ప్రియురాలగు నూర్జహానున కనిష్టము, అది కారణముగ జక్రవతి౯కి వానిపై నంతయిష్టము లేదు. అందుచేత నా త్రాఁగుబోతు చక్రవతి౯, షాజహానునిఁ ద్రోసి వైచి తనమూడవకుమారుఁడును, త్రాగుబోతు తనమునఁ దనకుజ్జియగువాఁడునగు పార్విజును దనయనంతరమున జక్రవతి౯ యగునట్లు నియమించెను. నూర్జహాను జహంగీరుని నాల్గవ కుమారుఁడగు షార్యరునకు సింహాసన మిప్పింపఁ బ్రయత్నించుచుండెను. స్థితిగతు లిట్లుండుటచూచి షాజహాను తాను రాజ్యమును స్వాధీనము జేసికొను నుపాయము వెదకుచుఁ బ్రియమిత్రుఁ