పుట:Raajasthaana-Kathaavali.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీకిని, మీవారునకును సంధి.

191


తనకుమారుఁడగు కరుణుఁడు చక్రవతి౯ సేవ చేసి ఢిల్లీ నుండి వచ్చినపిదప నొకనాఁడు మంత్రి సామంతుల నందఱఁ బిలువనంపి కొలువుదీర్చి రాణా వారి నందఱఁ జూచి "నాపని యయినది. ఇంక రాజ్యమెంత కాల మేలినను ఢిల్లీ చక్రవతి౯కి దాసుఁడనయి యేల వలయును' అట్లభిమానము జంపుకొని యేలుట నాకిష్టము లేదు." అని పలికి కుమారునిఁ బిలిచి “నాయనా! కులప్రతిష్ఠలు నీవ నిలుపఁదగిన వాఁడవు. రాజ్యమునందు నిన్నుఁ బతిష్ఠించెద" నని వాని మొగమున స్వయముగఁ దనహస్తముతో టీకా వేసి పట్టాభిషిక్తునిఁ జేసి యప్పుడ సభ విడిచి కోటవదలి గొంతదవ్వున నున్న సరోవరము పొంతకుఁ బోయి యక్కడ మున్నుదయసింగు గట్టించిన మందిరమునఁ బ్రవేశించి దలుపులు మూసికొనియె. ఆదినము. మొద లామహారాజెన్నఁడు మరల ప్రజలకంటఁబడ లేదు. అయిల్లు వికిచి యీవలకు రాలేదు. అటు పిమ్మట నై దేండ్ల కతఁడు మృతినొంద దహనము నిమిత్తము కొనిపోవు చున్నప్పుడు వాని మ్రుతకళేబరము మాత్రము ప్రజలు చూచిరి.

అది మొదలు మీవారు రాజ్యమునకుఁ గ్రోత్తశకముప్రారంభమయ్యెను. అంతకుముందా రాజ్యము ఢిల్లీతో సంబధము లేక తనకున్నంత వఱకు తృప్తి నొంది ప్రజా సౌఖ్యకరముగా నుండెను. కాని యీసంధి యైనపిదప నదిగూడ చక్రవతి౯ గారి రాజ్యతంత్రపు సుడిగుండములలో బడక తప్పదయ్యెను. అదృష్టవశమున ఢిల్లీ మీవారు లకు నూతనముగా సంధి జరిగినప్పుడు మీవారు మంచి రాజుల చేతిలో బడినందున దానిగౌరవము దక్కె. కరుణునికంటె నెక్కుడు ప్రతాపవంతులు విశేష ప్రజ్ఞావంతులు నగు రాజపుత్రు లనేకులు చక్రవతి౯ సభలోఁ బెక్కు సారులు పరాభవము నొందినట్లు చాలకథ లున్నవి గాని కరుణునివిషయమయి యట్లు లేదు. అతఁడు మీవారును పాలించీన యెనిమిది యేండ్లలో దేశమును జక్కనిస్థితిలోనికి దెచ్చి పాడిపంటలతోఁ దులతూగునట్లు చేయుటయే గాక కొమ్ముటేనుఁగులవంటి