పుట:Raajasthaana-Kathaavali.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

రాజస్థానకధావళీ,


మొదలు దండయాత్రలు కలహములు లేక సేమముగ నుండు నని సంతోషింపవలసినపని లేదయ్యె. ఏలయన నది మొదలు మీవారు ప్రభువులు ఢిల్లీ చక్రవతి౯కి లోఁబడిన వా రయి స్వాతంత్య్రము గోలు పోవుటచేత రాణాకు రాజకుటుంబమునకుఁ గాలక్రమమున ఢిల్లీ నుండి వచ్చు బహుమానములు దుఃఖకరములుగ నుండెను. యుద్ధము మానుకొని చక్రవతి౯ని గొలుచువారికి యుద్ధపుగుఱ్ఱములు మహాయుధము లెందుకు? జహంగీరు రాణా యొక్కయు వానికుమారునియొక్కయు బ్రతిరూపములసు స్ఫిటిక శిలలతోఁ జేయించి తన యుద్యానవనమున బెట్టించుకొనియె. అవి చూచిన వారందఱు చిత్తూరు రాజవంశమున కంతకన్న నవమానకరమగు పని లేదని భావించిరి.అది యటుండ రాణా యొక్క మనుమఁ డగు జగత్సింగు సయితము ఢిల్లీలోనే యుండి చక్రవతి౯ యిచ్చు బహుమానముల కుబ్బి వారినే మెచ్చుచుండెను. జహంగీ రోకసారి కొన్ని బంగారుబొమ్మలఁ జేయించి రాణా వద్దకు వాని మనుమని చేతనే పంపెను. రాణా యాబొమ్మలఁ జూచి తనయొక్కయు తనకుమారునియొక్కయు బొమ్మలే చక్రవతి౯ యుద్యానవనములలోదాస్యము చేయునట్లుండి హృదయము నెప్పుడు గాల్చుచుండ నీ బంగారు బొమ్మను మా కేమి యానంద మీయఁగల వని విచారించెను, విచారించుటయేగాదు. ఈ మహాపరాభవము నతఁడు సహింపఁ జాలఁడయ్యె. తొల్లి ప్రతాపరాశియగు ప్రతాపసింగు జీవించి యున్న కాలమున వాని చేతి క్రిందనుండి మహమ్మదీయులతోఁ బోరిపోరి నతనిపరోక్షమునఁ దాను గద్దెయెక్కి సేనలం బురికొల్పి నడిపించి యప్రతిహతపరాక్రములగు ఢిల్లీ చక్రవతు౯ల ననేక పర్యాయముల రణరంగంబునఁ బరాజయము నొందించి పావన చరిత్ర యగురాజ్యలక్ష్మిని గోహంతకులపాలు గాకుండఁ జేసి పితృపితామహుల ప్రతిష్ఠ నిలిపిన తాను నేఁటికాలమున నిట్ల ధోగతిపా లయినందులకుఁ దద్దయు సిగ్గుపడి యుమ్రా యీవిధముగఁ జేసెను.