పుట:Raajasthaana-Kathaavali.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీకిని, మీవారునకును, సంధి.

189


యకుండ దొర్లుచుండ నాషోకులమారి చక్రవతి౯ గుణములఁ జూచుట చేతనో మఱి యెందు చేతనో తెలియదుగానీ యా బాలుఁడు చక్రవతి౯ యెంత యాదరించినను దిగులుజెందినవాని వలెనే సభలో నుండుచు వచ్చెను. షాజహాను వానిని కోంచెము సంతోష పెట్టుటకు ప్రతిదినము వాని కొక క్రొత్తబహుమాన మిచ్చుచు, అప్పుడప్పుడు నూర్జహాను కొలువునకుఁ దీసికొని పోవుచుండెను. చక్రవతి౯ని తన వలలో వేసికొని యతఁడు తనగీచిన గీటు దాఁటకుండ జేసికొని మగని మనస్సునేగాక హిందూస్థానమునంతయు నేల గలిపిన యానెరజాణ నూర్జహాను యారాజపుత్రకుమారునకు మంచియేనుఁగ యొకటి గుఱ్ఱ మొకటి కత్తియొకటి బహుమానమిచ్చెను. అంతియేగాక రతనాలు చెక్కిన కత్తులు మేలిమి యుంగరములు పారసీకతురగములు ముత్యాల హారములు రత్నకంబళములు సుగంధ ద్రవ్యములు బంగారు పాత్రలు మొదలగు పారితోషికముల షాజహానుఁ డా క్రోత్త సామంతరాజకుమారునకు విసుగులేక యర్పించెను. అట్లు రాజపుత్రుఁడు బడసిన బహుమానములఁ గూర్చి తన గ్రంథమున నిట్లు వ్రాసెను.

"ఆ రాజకుమారుఁడు నాసభకు వచ్చినది మొదలు తిరిగి వెళ్లు వఱకు నాకుమారుఁడు షాజహానుఁ డిచ్చిన యై దేనుఁగులు నూట పది గుఱ్ఱములుగాక నేను స్వయముగా నిచ్చినరత్నములు బంగారు నగలు గజతురంగములు మొదలగు బహుమానములు విలువ పదిలక్షల రూపాయలు.” ఈ యల్పబహుమానములఁ జేకొని కరుణుఁడు రాణా యుమ్రాయు “మీవారు రాజ్యపు పరువు ముందర పదిలక్షలరూపాయి లన నెంత. మనము పొరపాటు పడి నిష్కారణముగ దేశ స్వాతంత్య్రము తురకల కమ్ముకొంటి” మని తద్దయు విచారించి లోలోపల కుళ్ళు చుండిరి. జహంగీరు సభలోఁ గరుణుఁడు గూడ ముఖవికాసము తక్కి యుండుటకుఁ గారణ మిదియే. సంగభూపాలుని కాలమునుండియు దురకల బారిపడి స్థిమిత మెట్టిదో యెఱుంగని మీవారు రాజ్యము నేఁడు