పుట:Raajasthaana-Kathaavali.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

రాజస్థానకధావళీ,


అట్లుండగా నొక నాఁడు పురదేవత వానికిఁ గనఁబడి వాని నచ్చోటు విడిచిపొమ్మని యాజ్ఞాపించెను. అందుచే నతఁడు కడు వెఱచియచ్చట నుండఁజాలక నగరమును స్వాధీనము చేసికొనవలసినదని యుమ్రాకు వత౯మాన మంపి వాని భటులకుఁ గోట నప్పగించి యాతఁడు ఢిల్లీకిఁ బోయెను, చక్రవతి౯ వానిపై నలిగి యేల వచ్చితివని యడుగ నతఁడామాటకుత్తరము చెప్పక యోరలోనుండి కత్తి యూడఁ బెరికి పొడుచు కొని చచ్చెను. చేసిన రాజద్రోహమునకు నాత్మహత్యకు వానిని హిందువులు తురకలు నేక గ్రీవముగ నిందించిరి.

చిత్తూరు దొరకుటచే రాజపుత్రుల కుత్సాహము మఱింత హెచ్చెను. పాడు పడి యుండుటచేఁ జిత్తూరు రాజపుత్రుల కంత ప్రయోజన కారి కానందున నుమ్రా వెంటనే దానిని యెప్పటి యట్లడవి మృగములకు విడిచి పెట్టి యప్పటికిని మొగలాయీల స్వాధీనములో నుండి ప్రధానములగు దుగ౯ములఁ గొన్నిటిని బట్టుకొనఁదలంచెను.

యుద్ధసన్నాహము సేయుచుండ వానికి బదునాఱ్గురు రాజకుమారులు వచ్చి తోడ్పడిరి. ఆకుమారుల చరిత్ర యీక్రింద సంగ్రహముగా వ్రాయుచున్నాము. కలఁడుగదా ప్రతాపసింగునకు సూక్తుఁడను సోదరుఁడొకఁడు. అతఁడును దేశద్రోహి మయి తురకలలోఁ గలిసి యన్నతో యుద్ధము చేసి హల్దీఘాటు యుద్ధములోఁ బ్రతాపుఁడు పారిపోవుచుండ వానిఁ దరుముకొనిపోయి యెట్టకేలకు సోదరునిప్రాణములు కాపాడెను. అతఁడు తనకడపటిదినముల చక్రవతి౯ని విడిచి భింసురాకోటలో గడపెను. చనిపోవునప్పటి కతనికిఁ బదునేడుగురు కుమారు లుండిరి. అతఁడు మృతినొందినతోడనే పెద్దకొడుకు భాంజీ యనునతఁడు తమ్ములను వంచింపఁ దలఁచి వారిం జూచి "నేను కోటఁ గాచుచు నిక్కడ నుండెదను. మీరుపోయి నాయనగారి కుత్తరక్రియలు సేయుఁ" డని చెప్పెను. అన్న మాటలు నమ్మి వారంద ఱవలకుం జని తండ్రి కగ్ని సంస్కారము నుత్తర