పుట:Raajasthaana-Kathaavali.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోడశ రాజకుమార చరిత్ర,

177


క్రియలును చేసి మైల వెళ్ళిన వెనుక మరలఁ గోట కరుగ భాంజీ వారిని లోపలికి రానీయక కోటతలుపులు వేయించి యందఱను బోషిం చుటకుఁ దనకు శక్తి చాలదుగావున వేరోక తావు కుంటబోయి యెవరి పొట్టవారు పోసికొండని యానతి చ్చెను.

షోడశ రాజకుమారులు సోదరునాజ్ఞ శిరసావహించి తమ యా యుధములను తమగుఱ్ఱములం దమ కిచ్చినచోఁ దొలఁగిపోదుమని చెప్పిరి. భాజీ సరే యని వాని నీయ వారందఱు విదేశములకు బయలుదేరి తమలో నొకఁడగు యచలుని సేనాపతిగఁ జేసికొని మహా బలశాలి యగు బలుండను వానిని రెండవసేనాపతిగఁ నియమించు కోని చనిరి.

ఆసోదరు లట్లు బయలుదేరి మీవారునకు దక్షిణమున రహతూరువఁ శస్థుల పాలనములో నున్న మేడూరుగ్రామమునకుఁ బోవ సమకట్టిరిగాని పయనము తుదముట్టక మునుపే యచలుని భార్య ప్రసవవేదన పడ నారంభింప వారందఱు మరుగుతావు వెనుక నారంభించిరి. అత్తరి వర్షము విరామము లేక దిమ్మరించెను. ఎంత వెదకినను వారికి గోష్పదమంత చోటయిన నాయాపత్సమయ మందు దొరకకపోవుటచే నెట్టకేలకు వారోక పాడు దేవాలయుమును గని పెట్టి కొంచెము బాగుచేసి యామెను దానియందుఁ బ్రవేశ పెట్టిరి.

ఆజడివానకు నానినాని యాగుడి రాతిదూల మొకటి జారి యామెపైఁ బడుటకు సిద్ధముగనుఁడ దైవవశమున బలుఁడు దానిని జూచి వెంటనే యత్తావున కరిగి తనతల బోటు పెట్టి రాయి వడకుండఁ జేసెను. ఇంతలో నచలుఁడు మొదలగు సోదరు లాస్థితిని జూచి చేరువ చెట్టు నరికి దానిం దెచ్చి బోటు పెట్టి భీమబలుం డగుబలు నీవలకు లాగిరి.

ఆరాత్రి యచలునిభార్య యాపాడుగుడిలో నొకకుమారుని గనియెసు. ఏవోభాగ్యముగల్గునని పుట్టెడాశతో వారు పోవుచుం