పుట:Raajasthaana-Kathaavali.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షోడశ రాజకుమార చరిత్ర,

175


యేడుపుమాని యందఱి యెడలఁ బ్రసన్నుఁడయి వారివందనము లందుకొని శలుంబ్రాను బిలిచి "నీవు మంచిపని చేసితివి.నీమోటతనము చేతనే నాకిప్పుడు బుద్ధివచ్చినది. లేనిచో నప్రతిష్ఠ పాలయిపోవుదును గదా? ఇదె చూడు నాదెబ్బ మీపూర్వపురాణా చేసినంతపనిచేసెద"నని వీరాలాపము లాడుచు సంగరమునకు సైనికులఁ దోడ్కొనిపోయె.

అవ్విధంబున నుమ్రా పౌరుషోక్తులు పల్కుటచేత రాజపుత్ర సైనికుల కుత్సాహము పొంగిపొరలెను. ఆయుత్సాహముతో రణమునకుఁ జని వారు తురకసేనల నవలీలగా నోడించిరి. ఓడిపోవుటచే మఱింతపౌరుషము తెచ్చుకొని యెట్లయిన రాజపుత్రుల నోడింపవలెనని చక్రవతి౯ యుమ్రామీఁదికి రెండేండ్ల తరువాత మఱియొక సేన నంపెను. ఈ సేనయు వెనుకటిసేనగతినే పొందవలసి వచ్చెను. అందుచే జహంగీరు రోసముఁజెంది మోసము చేత రాజపుత్రుల జయింపవలెనని యెంచి చిత్తూరుపురమన్న రాజపుత్రులకు మిక్కిలి ప్రేమయనియు దానినిమిత్త మెంద రెందరో ప్రాణములను విడిచిరనియు నెఱిఁగినవాఁడు దానికి వానిని రాణాను జేసి యేలుకొమ్మనియె. ఈసూగ్రుఁడు ప్రతాపుని తమ్ముఁడు, ఈతఁ డన్నతోఁ గలహించి దేశద్రోహియయి ఢిల్లీచక్రవతి౯కాని గొలువఁబోయిన నాఁటనుండియు నచ్చటనే యుండెను.

సూగ్రాపాడుపడిన చిత్తూరులో రాజ్యముచేయుట వల్లకాటిలో రాజ్యముచేయుటగా భావించెను. పాడుపడిన దేవాలయములలోను, దిబ్బలయిన మేడలలోను వానికంటికి దయ్యములు భూతములు దేవతలు నప్పుడప్పుడు కనఁబడుచున్నట్లు దోఁచెను. తురక బంట్ల సాయముతోఁ దన పూర్వుల పట్టణము నేలుటకు వచ్చిన యావీరునకు వీర రసము జారి వెనుకటిసంగతులు జ్ఞప్తికివచ్చి భయము క్రమ్మజోచ్చెను ఎంతకాలమతఁ డక్కడ వేచియున్నను తనవెంటవచ్చిన తురక బంట్లుఁ దానును దప్ప దేశస్థులు బంధువులు నెవ్వరు నచ్చటికి రారయిరి.