పుట:Raajasthaana-Kathaavali.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

రాజస్థానకధావళి.


పత్యముఁ జేయుమని వాని నడిగిరి. ఆశూరులు వచ్చునప్పటి కుమ్రా మేనొత్తని మెత్తని పాన్పులం బవ్వళించి వారి విన్నపములఁ జిత్తగించి వారి కిట్లనియె. "నేను నూనుగుమీసముల వయసునాడే మహా యుద్ధములఁ జేసి విసిగి యుంటి చక్రవతి౯తోఁ బోరుట మన నాశముగోరుట. కావున యిపుడయిన బుద్ధిగలిగి వైరము మానుకొనుట యుచితము.”

అప్పలుకులు చెవులఁ బడుటయు రాజపుత్ర వీరులు తెల్ల పోయి యొండొరుల మొగంబులు చూచుకొని లోలోపల గొణుగుకొనుచుండ, నపుడు చందావతు వంశజుఁడగు శలుంబ్రా కత౯వ్యము యోచించి యూరకొనినఁ గార్యము చెడునని యొక సాహసము చేసెను. రాణాయున్న మేడమీఁద విలువగల రత్నకంబళములు పరువఁబడి యుండెను. ఆకంబళము పై పరషు చేసి యాబట్టలు కదలకుండ కొనల నిత్తడిగుం డ్లెత్తి పెట్టి యుంచిరి. శలుంబ్రా యాయిత్తడిగుండ్లలో నొకటి తీసికొని రాణా కెదురుగానున్న పెద్దనిలుపుటద్దముపయి విస రెను. తోడనే యాదర్పణము వేయి తునుకలయి వడియె. పిమ్మట శలుంబ్రా సాటి రాజపుత్రులఁజూచి వీరులారా ! గుఱ్ఱము లెక్కుఁ డెక్కుఁడని పురికొల్పి రాణా చేయి పట్టుకొని పాన్పునుండి బలవంతముగ లేవఁదీసి యతని యిష్టము లేకయే "గుఱ్ఱ మెక్కు మెక్కుమని” బరబగ లాగికొని పోవఁజొచ్చెను శలుంబ్రా యొక్క మొండితనము నకు మహారాణా కడు కిన్కఁబూని 'వీడు రాజద్రోహి రాజద్రోహీయని యరచుచు వాని చేతినుండి వదలించుకొనుటకు గిజగిజ తన్ను కొనఁజొచ్చెను. కాని సాటిసామంతు లందఱు శలుంబ్రా పక్షము బూనుటచే ' వానిరోదన మరణ్య రోదనము కాఁగా నతఁడు కోపము పట్టజాలక రోషమున వావిడిచి యేడ్వసాగెను. అతం డేమి చేసినను లెక్క సేయక శలుంబ్రా రాణాను గుఱ్ఱముమీఁదఁ గూలవేసి నడిపించుకొని పోవంజోచ్చె.

అట్లు కొంతదూరము చనిన పిదప నుమ్రా కోప మణచుకొని