పుట:Raajasthaana-Kathaavali.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

171

రాణా ప్రతాపసింగు.


మిత్రుఁడు, మహాపండితుఁడు, సజ్జనుఁడు నగు నబులు ఫేడలను వానిని నిష్కారణముగఁ జంపించెను. ఈగృహచ్ఛిద్రములచే మనో వైకల్య మునంది యక్బరు రాజస్థాన వ్యవహారములను మునుపటియట్ల శ్రద్ధగా జూచుట మానెను.

అయిన నక్బరుచక్రవతి౯యె ప్రతాపునికన్న నెక్కుడు కాలము బ్రతికెను. ప్రతాపుఁడు బహుకష్టములఁ బడిచీము నెత్తురు శత్రువులకు ధార వోయుటచే నకాలమునందె ముసలివాఁడై త్వరగ మృతినొందెను. ఎంత శ్రమపడినను ప్రతాపుఁడు చిత్తూరును బట్టుకొనఁ జాలఁ డయ్యెను. తనకొడుగకు నుమ్రా యప్రయోజకుఁ డగుటచే ముందు ముం దానగరును బట్టుకొను నాశయు విడచెను. చిత్తూరు పట్టుకొనక తన రాజధానిం బ్రవేశింపఁ గూడదని యతఁడు ప్రతిన జేసినందున నుదయపుర సరోవరము చెంతఁ దా నిర్మించుకొన్న గుడిసెలోనే యా మరణాంతము వసించెను.

అడవులలో గాయలు పండ్లు తిని పగతురతో యుద్ధములు చేసి నంత కాలము ప్రతాపుఁ డేయా యాసము నెఱుఁగఁడు గాని కష్టములు. గడపి యిల్లు చేరిన పిదప వాని దేహము క్రమక్రమమున దుర్బలమై రోగ భూయిష్ట మయ్యెను. వ్యాధి యంతకంత కెక్కువ కాఁగా రాణాకు, మరణసమయ మాసన్న మయినదని బంధుమిత్రు లందఱు చుట్టుం జేరిరి. అతఁడు మరణ వేదనఁ బడుచు నోటిలో నేదియో గొణుగు కొనుచుండ నది చందావతువంశస్థుఁడు విని దగ్గఱకుఁ బోయి "నీ ప్రాణము సుఖముగా పోకపోవుటకు నీ కున్న విచారమేమి" యని యడిగేను. ప్రతాపుఁ డానీరసములోనే కొంచెమోపికఁ దెచ్చుకొని మెల్లన నిట్లనియె. "నాయనా! మీరు కంఠములో ప్రాణము లుండగా మన రాజ్యమును తురక వానికి లోఁబఱచ మని నా చేతిలో చేయి వేసి ప్రమాణము చేయువఱకును నాప్రాణము పోదు. ఆమాట శ్రవణానందముగా విని పోవలెనని యున్నది" అని చెప్పి తనకోడుకును