పుట:Raajasthaana-Kathaavali.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

రాజస్థానకథావళి.


గూర్చి వెండియు నిట్లనియె. "ఉమ్రా నావలే నీ చిన్న గుడిసెలోఁ గాపురము సేయనొల్లఁడు, ఈపర్ణశాలలు పీకి యిచ్చోట వాఁడు పెద్ద పెద్దభవనములు కట్టును. అటుపిమ్మట నతిసుకుమారుఁడై కూర్చున్న చోటనుండి లేవ లేకపోవును. మన నెత్తురు ధార వోసి మనము సంపాదించిన యీ మీవారు దేశమును వాడు సుఖముమరఁగి నిష్కారణముగ గోల్పోవును.”

మరణమునకు సిద్ధముగ నున్న యామహా రాజుమాటలు విని రాజబంధువు లైక కంఠ్యముగ నిట్లనిరి. "చిత్తూరు మరలఁ బట్టుకొను వఱకు, మీవారునకు సంపూర్ణ స్వాతంత్ర్యమువ చ్చువఱకు యీగుడిసె గుడిసెపాళముననే యుండునుగాని యచట మేడలు గీడలు కట్టము, మేము మీగద్దెయానగాఁ బ్రమాణముఁ జేయుదుము. ఉమ్రా కూడ మీయానఁ దప్పకుండునటుల నడిపించెదము.”

ఈమాటలు వెడలినతోడనే రాణా వెనుకకుపడిపోయి ప్రాణములు విడిచెను. ప్రతాపసింగు రమారమి యిరువదియాఱు సంవత్సరములు మీవారురాణా యయి యుండెను. కాని యా కాలమున స్వల్పభాగమే రాజ్యపాలన మందును విశేష భాగము కష్టములఁ బడి యుద్ధములు చేయుటయందును జరుపఁ బడెను.


షోడశ రాజకుమార చరిత్ర

--(0):---

తనకుమారుని విషయమై రాణాప్రతాపుఁ డనుకొన్న దంతయు నిశ్చయమయ్యెను. ప్రతాపునిశరీరము దహనమయినతోడనే వాని పుత్రులు మంత్రులు సామంతులు వాని చెప్పిన మాటలు మరచిరి. పెద్దకొడుకగు నుమ్రా సింహాసన మెక్కెను. కాని యతఁడు బాల్యము