పుట:Raajasthaana-Kathaavali.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

రాజస్థానకథావళి.

ణముల నీయఁదలఁచుకొన్నాఁ డనియు పాఱిపోవక మీవారు దేశముయొక్క ప్రతిష్ఠను నిలువఁ బెట్టుటకు మఱియొక మాఱు యుద్ధ ప్రయత్నముఁ జేయఁదగు ననియఁ బ్రార్థించెను.

ప్రతాపుఁడు దేశమును విడిచిపోయెనని విని చక్రవతి౯ సైనికులు సంతసించి యతఁడు సింధు దేశఁపు టెడారిలో నెక్కడనో త్రాఁగ నీరు లేక వడఁగొట్టి చచ్చియుండు నని నమ్మి కోటలలోను పట్టణముల లోను మిక్కిలి యశ్రద్ధగా నుండిరి. అటులుండ నాకస్మికముగఁ బ్రతాపుఁడు వచ్చి పడెపడె నని యడవుల గొండల గొప్పవాఁడుక పుట్టెను, పుట్టినతోడనే ప్రతాపుని సైన్యము నడచిన దారి యంతయు పీనుఁగు పెంటయై యతఁడు వచ్చిన యానవాలుఁ జూపెను.

మివారు దేశమునఁ జక్రవతి౯కి స్వాధీన మయిన భాగమంతయుఁ బ్రతాపుఁడు నాశనము చేసెను. ఇది ప్రారంభించిన సంవత్సరము లోపుననే యజమిరు చిత్తూరును దక్క తక్కిన మీవారు దేశము రాణా స్వాధీన మయ్యెను. ఇట్లయినపిదపఁ గొంత శాంతి నొంది ప్రతాపుఁడు తన ప్రాఁతపగతుఁడగు మానసింగుమీఁదఁగల యక్కసుఁ దీర్చుకొనఁదలఁచి యాతని రాజ్యమందలి ముఖ్యవత౯క స్థానముం గొల్లగొని యపారమగు ద్రోపుడు ధనమును మీవారునకుఁ దరలించు కొని పోయెను.

పరాభవము నొందిన మానసింగునకుఁ దప్పఁ దక్కిన రాజఫుత్రుల కందఱకు రాణా మీఁద మహాభిమాన ముండు చే నక్బరు నాతని నేమియుం చేయఁజాలం డయ్యె. దానికిం దోడుగాఁ గొన్ని జిల్లాలు చక్ర వతి౯ యధికారమును దిరస్కరించెను. అదిగాక యక్బరునకు వార్థకావస్థ వచ్చెను. ఆ సమయంబున గృహకలహములు గూడ నెక్కువయ్యెను. అతని కొడుకులలో నిద్దఱు తెగ త్రాగి యొడలు తెలియక చచ్చిరి. జ్యేష్టకుమారుఁ డగు సలీము (జహంగీరు) తండ్రిని ధిక్కరించి గృహము విడిచిపోవుటయేగాక తండ్రికి బ్రాణ