పుట:Raajasthaana-Kathaavali.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా ప్రతాపసింగు.

169


ఈయుత్తరముఁ జదువుకొన్న పిదపఁ బ్రతాపుఁడు చక్రవర్తితో సంధి చేసికొను తలంపు మానుకొనెను. తనస్వజన మంతయుఁ దనమీఁద నే యాసలు పెట్టుకొని యున్నవారు గావున వారి యాస లడు గంటఁ జేయఁగూడదని యేమయినఁగాని నేను లోఁబడ నని యతఁడు నిశ్చయించుకొనెను. ప్రస్తుత స్థితినింబట్టి చిత్తూరు మరలఁ బట్టుకొనుటకు వీలు లేదని గ్రహించి యతఁడు మీవారు రాజ్యమును విడిచి తురకల బాధ లేని మఱి యే దేశాంతరములకైనఁ బోయి తన్ను నమ్ముకొన్న బంట్లతోఁ గలసి కొత్త రాజ్యమును స్థాపించి యచ్చట సుఖింపఁ దలఁచుకొనియెను.

మొగలాయీలకు మూలపురుషుఁడును రాజపుత్రులకు మహా శత్రువు నగు బేబరు తన పిత్రార్జిత మగుసమర్కందు విడిచి కాబూలు రాజ్యము స్థాపించి యటనుండి మరల పగతురచేఁ దరుమఁబడి ఢిల్లీ రాజధానిం జేసికోని తనవంటి వారికి మాగ౯దర్శి యయ్యెనని జ్ఞప్తికిఁ దెచ్చుకొని ప్రతాపుఁడు తనతలంపు నెరవేర్పఁ దలఁచెను. రాణా సింధునదీపరిసర భూములకుఁ బోయి కాఁపురముండు ననియు వానితో నెవ్వరెవ్వరు పోయి వాని సుఖదుఃఖముల ననుభవింపఁ దలఁచిరో వారందఱు బయలుదేఱ వలయు ననియు మీవారెల్ల మ్రోగఁజోచ్చెను. అప్పుడనేకులు రాణా ననుసరింపఁ దలంచిరి. వారినందఱం దీసికొని ప్రతాపసింగు కొండలు దిగి యడపులు దాఁటి సింధు దేశపు టెడారి మొగకు వచ్చెను. అక్కడ విడిసియుండ 'భామసా' యను నతనివద్ద నుండి యోక రాయబారి రాణాకడకు వచ్చెను. భామసాయు వాని పూర్వులు పలుతరములవారు మీవారు రాజుల వద్ద మంత్రులై యుండి యింతింత యనరానిధనమును గణించిరి. అప్పుడు భామసావద్ద నిరు వదియైదు వేల సైనికులకు పండ్రెండు సంవత్సరములవఱకు నెంత ధనము కావలయునో యంతధన మింట మూలుగుచుండెను. ఆవచ్చిన రాయబారి ప్రతాపుని దర్సనము చేసి భామసా కావలసివధన మంతయు