పుట:Raajasthaana-Kathaavali.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

రాజస్థాన కధావళి.


తద్దయు సమ్మానించె. మానవతియు 'సౌందర్యవతియు ప్రతాపసోదరుఁడగు సూక్తుని పుత్రికయు నగునొకయువతి నాపృథివిరాజు వివాహ మయ్యెను.

అక్బరు చక్రవతి౯ తన వినోదమునిమిత్తము, తన్నుఁ గొలుచు వారి వినోదమునిమిత్తము, ప్రతిమాసము తన యంతపురమున నొక సంత జరుపవలయునని యానతిచ్చె. చక్రవతి౯ యాదరణమున జరుగుటం జేసి యాసంతకు విదేశముల నుండియు స్వదేశమునుండియు వత౯ కుల భార్యలు వచ్చి విలువ సరకుల నమ్మఁజూపుచు వచ్చిరి. చక్రవతి౯ భార్యలు కొమాతె౯ లు వారి చెలికత్తెలు దాసీజనములు మంత్రులు సేనాపతులు మొదలగు వారి భార్యలు వచ్చి యాసంతలో దుకాణములు పెట్టి తాము స్వయముగఁ గుట్టి సిద్ధము చేసిన పట్టుదుస్తులు మొదలగువాని నమ్మవలయును. అమ్మకయున్న వత౯కుల భార్యల వద్దనుండి కొననైనఁ గొనవలయును. చక్రవతి౯ యంతఃపుర స్త్రీలు దుకాణములు పెట్టి యమ్ముటచే విలువ లేనిసరకులసయితము మితిమీఱిన వెల వచ్చుచుండెను. ఆసంతకు స్త్రీ లేగాని పురుషు:ు రాఁగూడదు. చక్రవతి యప్పుడప్పుడు స్త్రీ వలె మాఱు వేసము వేసికొని యా సంతయొక్క వైభవమును జూచుచుండును. ఆసంగతులు వెల్లడియైనప్పుడు రాజపుత్రులు కోపించి చక్ర వతి౯ దురుడ్డేశముతోడనే యా పని చేసెనని నమ్మిరికాని యక్బరు వివిధ దేశములనుండి వచ్చిన వింతవింతసరకుల వెలలు నాణెములు స్వయముగఁ దెలిసికొనుటకు వాణిజ్యము నభివృద్ధి చేయుటకు నట్లు చేసెనే కాని చెడ్డ తలంపున నా తావునకుఁ బోవ లేదని మహమ్మదీయ చరిత్ర కారులు వ్రాసిరి. ఎట్లయినను రాజపుత్రుల కీవిషయమున గట్టియనుమాన ముండుట చేత వెనుక నక్బరునకు లోఁబడి రంతంబరుకోట నప్పగించిన బూందీసంస్థాన ప్రభువు తన యాఁడువాండ్రను సంతకు రమ్మని బలవంత పెట్టకూడదని యొడంబడికలో స్పష్టముగ వ్రాయించెను,