పుట:Raajasthaana-Kathaavali.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా ప్రతాపసింగు.

166


యుండును; కాని యైశ్వర్యము రాని రాకపోని యన్న ముండనీ లేకపోనీ వారా మాటమాత్రమనరు. రాణా వారియెడదయగా నున్నన్ని నాళ్లు వారు వానియెడఁ గృతజ్ఞు లై యుందుకు ఈకష్టములకు నపాయములకుఁ దోడుగఁ బ్రతాపుని యాలుబిడ్డలు వానివద్దనే వనము లలో నుండిరి. బంగరుతోట్లలో నూగవలసిన యా మహారాజు చిన్నిపాపలు చెట్లకొమ్మలకు వ్రేలఁగట్టిన గుడ్డయుయ్యెలలో నూగవలసి వచ్చె. ఒకప్పుడు మగవాఁడు యుద్ధములకుఁ బోయిన సమయమునను నాడువాండ్రు పగతురకు జంకి పొదలలోఁ దాఁగోన్న సమయమునను జిన్న బిడ్డలను బులులు దీసికొని పోకుండ బుట్టలలోఁ బెట్టి చెట్లకోన కొమ్మలకుఁ గట్టవలసివచ్చెను. ప్రతాపుఁడు గతించిన రెండువందల యేఁబదియేండ్ల తరువాత ననఁగా నేఁడుసయితము వనవాసులు ప్రతాపమహారాజు కునికిపట్లగు చెట్లకు రాచబిడ్డ లుయ్యెలలూఁగిన కొమ్మలను జూపుదురు. శత్రుభీతి చేతఁ బలునూఱు లాడువాండ్రు మగ వాండ్రుఁ బరుగు లెత్తవలసి వచ్చుటచే నొకమాఱు ప్రతాపుఁడు తనబిడ్డలను దనతో తీసికొనిపోవుటకు వీలు లేకపోయెను. అప్పుడు భిల్లులు కొందఱు కనికరముఁ బూని యశిశువులను గంపలలోఁ బెట్టి తీసికొనిపోయి తగరపుగనులలో దాఁచి శత్రువులు దాఁటిపోవువఱకు పాలుపోసి పెంచి మరల తలిదండ్రుల కప్పఁ జెప్పిరి.

వీరిగతి యిట్లుండ నక్బరునకు లోఁబడిన రాజపుత్రులు సమస్త సంపదలు గలిగి సుఖపడుచుండిరి. చక్రవతి౯ని శరణుజొచ్చిన రాజపుత్రులలో ముఖ్యులిరువురు గలరు. బికనీరు సంస్థాన ప్రభువు యోక్క నిరువురు కొడుకులు రాయసింగు పృథివిరాజు నను వారు. అక్బరుచక్రవతి౯ యయ్యిరువురు రాచకోమరులను గడుగౌరవమున నాదరించి యందు రాయసింగు కూఁతునుఁ దనకుమారుఁ డగు జహంగీరున కిచ్చి పెండ్లి చేసెను. పృథివిరాజు మహావీరుఁ డగుటయేగాక మంచికవియు నగుటచే రాజపుత్రులలో నెల్ల నతఁ డగ్రగణ్యుఁ డని యక్బరు వానిని