పుట:Raajasthaana-Kathaavali.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా ప్రతాపసింగు.

165


ఈవింత సంతలో నొకమా ఱక్బరు తన వియ్యపురాలగు రాయసింగు భార్యను జూచెను, ఆచూపు మిక్కిలి యనర్థకమును దెచ్చెను. ఆరాజు దృష్టి తగిలిన కొలఁది కాలముననే రాయసింగు భార్య యమూల్యము లగుమణులను వెల లేని బంగారు నగలను చక్రవతి౯ వద్దనుండి తెచ్చుకొని కులుకుచుండె. మహాకవియగు పృథివి రాజు తన యన్నకుజరిగిన యీ దారుణ పరాభవము వర్ణించుచు గోన్ని పద్యములు వ్రాసి వాని యవస్థకు చాల దుఃఖించెను. ఇది యెఱింగియు బృథివిరాజు భార్య సంత జరిగినపుడెల్ల నంతఃపురమునకుఁబోక తప్పదయ్యెను, అట్లు పోవునపు డోకసారి యామె చక్రవతి౯ దృష్టి పథమునం బడియెను. పడినతోడనే యతఁ డామె జగన్మోహనాకారమును జూచి మోహపరవశుఁ డయ్యెను.

ఆమె సంతలో తనకుఁ గావలసిన సరకుల నెల్లఁ గొని చీఁకటి పడిన వెనుకఁ దనమందిరమున కరుఁగదలఁచి నిర్జనములగు గదులు దాఁటి పలు చిక్కు దారులం బడి చనుచుండ గొంతదవ్వరుగునప్పటికీ యెట్టయెదుట నోక మనుష్యుఁడు దారికడ్డముగ నిలిచెను. ఆమనుష్యుని చూడఁగనే యతఁ డెవ్వఁడో, యేలవచ్చినో యామెతక్షణమె గ్రహించెను. చక్రవతి౯ మానభంగము చేయఁదలఁచి యెదుట నిలిచినపుడు రాత్రి చేతనాయుధమైన లేక నోంటికత్తెయగు నాడుది యేమి చేయఁ గలదు? బప్పరావులవంశపు మొలకయగు నీమానవతి తన తోడికోడలువంటిది కాదుగనుక వెంటనే ధైర్యముఁ దెచ్చుకొని యసహాయురాలగు తనకుఁ దోడుపడి మరణముకంటె దారుణమగు నీపరాభవమును దప్పించు మని తన యిష్ట దేవతను వేఁడుకోనెను. ఆ దేవియు భక్తురాలి మొఱ నాలకించి పులివాహన మెక్కి వచ్చి ప్రత్యక్షమై యొక ఖడ్గమును రాజపుత్రిక కిచ్చి యంతర్హిత యయ్యెనఁట. ఆకత్తి చేఁ బూని యావీరపత్ని డేఁగపగిది చివాలున చక్రవతి౯పై దుమికి యతఁడు మరల నామెను గొట్టఁ ప్రయత్నింపక మునుపే ఖడ్గము వాని కంఠ