పుట:Raajasthaana-Kathaavali.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

రాజస్థానకథావళి,


ముండదని నేను పరుగుపరుగున వచ్చి మిమ్ము తఱుముచున్న తురకల నిద్దఱను, నేనే పొడిచి చంపితిని. ఇదిగో నాగుఱ్ఱము దీని నెక్కి మీ ప్రాణములు దక్కించుకొనుండు. నేను ప్రస్తుతము సలీమువద్దకుం బోయి కోలఁదికాలమున మీపాద సేవ చేయుటకు వచ్చెద” అని పలికి సూక్తుఁ డన్నకు తనగుఱ్ఱమిచ్చి తన దారిం జనియె. చిరకాలము తనకుఁ గడు విశ్వాసముతోఁ బనిజేసిన కైటకము దన వైపుఁ జూచుచు నప్పుడే ప్రాణములు విడుచుటచే బ్రతాపుఁడు దాని కాపత్సమయమున దగునుపచారములు చేయలే నైతినని కన్నీరువిడిచి క్రోత్త గుఱ్ఱమునెక్కి మరల బయన మయ్యెను.

సూక్తుఁడును సోదరునివద్ద సెలవుపుచ్చుకొని పాదచారియై మొగలాయిశిబిరముం బ్రవేశించెను. అంత యాలస్యముగ నొంటిగఁ గాలినడకను వచ్చుటకు గారణ మేమని సలీము వానినడుగ సూక్తుఁడొక పెద్దకథ కల్పించి యిట్లని చెప్పెను. "అయ్యా ! దేవరవారియెడద్రోహియగు ప్రతాపుఁడు రణరంగము విడిచి పలాయతుఁ డగు చుండ నాదురాత్ముని బట్టుకొని 'దేవర పాదపద్మముల యొద్దఁ బడవేయవలయునని నేనును ముల్తాను కొరసానుప్రభువులగు నిద్దలు తురకలును బయలు దేఱితిమి. ఆప్రతాపహతకుఁడు మీతురక బంట్ల నిరువురఁ గడ తేర్చి నాగుఱ్ఱము నపహరించి నన్నుఁగూడఁ జంప నుంకించెను.కాని యేలినవారిపాదములు మరలఁ జూడ నోచుకొనుటచే నెట్టెటో గఁడముగడపి నేను బయటఁబడితిని,” అనపుడు నాపలుకుల యం దోక్క యకరమైనను సలీము నమ్మఁడయ్యె. నమ్మక పోయినను మహాక్రూర స్వభావుఁ డగు నతఁడెందు చేతనో సూక్తుని వెంటనే చంపింపక వానితో "జరిగిన నిజమును నీ వొప్పుకొంటివేని నీ కభయ మిచ్చెద నున్న దున్నట్లు, పలుకు” మని నిర్బంధించెను. అట్టి సమయమున నిజ మొప్పుకొనుటయే మంచిదని వానికి సూక్తుఁ డిట్లనియె. “మీవారు రాజ్యభారము మా ప్రతాపుని భుజముల పై నిలిచియున్నది.