పుట:Raajasthaana-Kathaavali.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్దము.

159


అతని దురవస్థఁ జూచి నామనసు కరఁగిపోవ నేను నాసోదరునిం గాపాడుకొంటి" నని యావద్య్రత్తాంతము జెప్పెను. అది విని సలీము వానింజంపింపక తన సేన విడిచిపొమ్మని యానతిచ్చెను. సూక్తుఁడు బయలు దేఱి వచ్చుచు నొక చిన్న సేనం గూర్చుకొని మధ్యమాగ౯ మున మొగలాయిల యాధీనములోనున్న భిల్సు రారను పట్టణమును బట్టుకొని యాకస్మికముగ నొక నాఁడు ప్రతాపునియొద్దకు వచ్చి నమ స్కరించి నిలిచెను. అతఁడు విస్మయమంది. తమ్ముని రాకకు గారణ మడుగ సూక్తుఁ డంతయు జెప్పి "నేను మీసేవకుఁడనైతిని. మీద ర్శనమునకు వట్టిచేతులతో రాఁక భిల్సురా పట్టణము పట్టుకొని వచ్చితిని, అది కానుకగ గ్రహించి మీవారు నన్ను మన్నింపఁడగు" నని ప్రాధి౯ంచుటయుఁ బ్రతాపుఁడు కృష్ణా మత్తుండై భల్సురా రాజ్యమును సూక్తునకిచ్చి తనకు లోఁబడి పాలింపుమని యానతిచ్చె. అది మొదలు సూక్తునిసంతి వారు సూక్తావతులను పేరం బరగి రాణాకు విధేయులై యుండిరి. సూక్తుని పేరు గాక యీయుద్దమున మనము ౙ్నాప కముంచుకొనఁదగిన మఱియొక వీరుని పేరుఁ గలదు. ధ్వజమును ముఱియొక చోటికిఁ గొనిపోయి రాణా ప్రాణములను గాచి మృతినొందిన జూలవంశస్థుఁ డే యీ 'రెండవ వీరుఁడు. అతఁడు చూపిన స్వామిభక్తి కి మెచ్చి ప్రతాపుఁడు వాని సంతతి వారికి రాజబిరుదమును నగారా నౌబతుల నిచ్చి చాల గౌరవించెను. ఆవంశస్థుఁడు రాణా బయలు దేఱునప్పుడు వానికిఁ గుడి ప్రక్కను బోవునట్టి గౌరవముఁ గలిగి యుండె. ఈవిధముగ హళ్డిగట్టుయుద్ధము ముగిసెను.