పుట:Raajasthaana-Kathaavali.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్ధము.

157


కొనివచ్చిన తురకలిద్దరు ఱాళ్ళమీఁద జారిపడితిమా చావవలసివచ్చుననియు ప్రతాపునిపంటి యసహాయ శూరుని మీఁదికి తమరిద్దఱు చన గూఁడదనియు దమవారు మణికొందఱు వచ్చువఱకు నిలుచుట మంచిదనియఁ దలఁచి యేఱు దాఁటరైరి.

ప్రతాపుఁడు పలుగాయములతో నెట్టుకోని కొంతదూరము పోయి నడచుటకు గుఱ్ఱమునకు దానిపైఁ గూరుచుండుటకుఁ దనకు బొత్తిగ నోపిక లేకపోవుటచే నేమి సేయఁదగు నని యోచించుచుండ నంతలో వెనుక నుండి కడువేగముగ దఱుముకొనివచ్చు నొకశత్రువుఁడు కనఁబడెను. వాని బాఱినుండి తప్పించుకొని పోవుటకు వీలు లేదని తెలిసి పోరాడి గౌరవముగ మృతినొందవలయునని నిశ్చయించి ప్రతాపుఁ డెదుర తిరిగి నిలిచెను. నిలిచిన తోడనే "యోమహావీరుడా! యుద్ధము నుండి పాఱిపోవు వీరుని మన సెట్లుండునో యిప్పుడు చెప్పగలవా?" యనుమాటలు వానికి వినఁబడియె. ఆమాట లేవరివో యని యతఁడు చూచునప్పటికిఁ దన మరణముగోరి శత్రు పక్షములోఁ గలిసిన తన సోదరుఁడు సూక్తుఁడే యతఁడని గ్రహించి. యాపలుకుల కుత్తరమియ్య ప్రతాపుఁడు పోరునకు సిద్ధము కాఁగా కైటకము నిలువ లేక నేలఁబడి మ్రుతినోందెను. అప్పుడు చేయున దేమియు లేక ప్రతాపుఁడు నిశ్చేష్టుడై నిలువ "నీవు భయపడనక్కర లేదు నేను నీకు హాని సేయుటకు వచ్చిన వాఁడను గాను. నీ ప్రాణములు పుచ్చుకొనుటకు వచ్చిన తురకలిద్దఱు నది కావలనే యున్నార"ని చెప్పి సమీపమునకు బోవ నన్నదమ్ము లిరువురులో నడగి యున్న చిరక్రోధానలము చల్లఁబడునట్లు వైరము మఱచి యెఁడొరులం గౌఁగిలించుకొని కన్నీరువిడి చిరి. ఆట్లు కొఁడొక వగచిన పిదప సూక్తుఁ డన్నతో నిట్లనియె. "అనేక మహావీరులచే నిరంతరము కోలవఁబడు శూరశిఖామణులగు మీరు గాయములచే బడలి కొండలంబట్టి పోవుచుండుటఁజూచి సహింపలేక యేక గర్భజనితున కింతకంటే సాయము చేయవలసిన సమయ