పుట:Raajasthaana-Kathaavali.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

రాజస్థానకథావళి.


జూచుచుండెను. చిక్కి శల్య మయి మనోవ్యధ చే పాలిపోయి మాసిన బట్టలు గట్టుకొని సామాన్యున ట్లుండియు రాజ తేజంబుచే మెఱయు చున్న ప్రతాపసింగును జూచిన తోడనే మానసింగున కెక్కడ లేని కోపము రాఁగా నాపుకోన లేక ప్రతాపునితో “ నేను నీపొగ రణగింపకపోదు నేని నా పేరు మానసింగు గాదు సుమా" మని పలికి యొట్టు పెట్టుకొని పోఁదోడంగెను. ప్రతాపు డాపలుకులకుఁ గోపింపక మానసింగుతో యుద్ధము సేయుట నాకును సంతోషమేయని గౌరవముగఁ బలికెను; కాని ప్రతాపుని పరిజనులలో నొక్కఁడు కోప మాపుకొనలేక చప్పటులు గొట్టి మానసింగును వెక్కిరించుచు మీ యక్బరు నీమాటు తీసికొని రా ! ఈసారి వానికి నీకునుగూడఁ దగినట్లు బుద్ది చెప్పించెద సనీ బిగ్గఱగఁ జెప్పి యిక్కడ వ్రాయుటకు వీలు లేని తిట్లు చక్రవతి౯ని వానిని దిట్టెను. మానసింగు సపరివారముగఁ బయన మయి పోయిన వెనుక నతఁడు నతని సైనికులు బసదిగిన చోట గూర్చున్న చోట నడిచిన చోట పవిత్ర మగుగంగా నది జలము తెప్పించి చల్లించి పుణ్యాహవాచనము చేయించి యంతతోఁ బోక వారి మైల గాలి తమపై సోకినందుకుఁ బ్రాయశ్చిత్తముగ దానును దన బందుగులును శిరస్నానము చేసి వెనుకటిబట్టలు విడిచి మంచిబట్టలు కట్టుకొని కమలమియరుకోటకుం జనిరి.

పరాభవము నొందిన మానసింగు వడివడిం బయనము చేసి ఢిల్లీ కిఁ బోయి యక్బరును దర్శించి ప్రతాపుఁడు తన యెడలం జూపిన యగౌరవంబును జక్రవతి౯ యధి కారము నెడం జూపినతిరస్కారమును బ్రతాపుని పరిజనులు చక్రవర్తిని జేసిననిందలను మఱచిపోక యొకటికిఁ బది జేర్చి పూసగ్రుచ్చునట్లు విన్నవించెను.ఈ కొండెములు విని యక్బరు మివారు పై దండెత్తుటకు సేన సిద్ధము చేసెను. ప్రతాపు నితో మాససింగు చెప్పిన విధమున నక్బరు స్వయముగ దండయాత్రకు రాలేదుగాని తనకుమారుఁ డగుసలీమును సేన కధిపతిగఁ జేసి మాన సింగును వానికి ముఖ్యమంత్రిగ నొనర్చి దండయాత్ర నడపించెను.