పుట:Raajasthaana-Kathaavali.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హల్డిగట్టు యుద్ధము.

153


ప్రతాపసింగు తన చిన్న సేనతో నెనుబది చతురపు మైళ్ళ వైశాల్యము గల సుద్దయపురజిల్లాలో నొక యడవిలో నుండెను. మోగ లాయిసేన నానాటికి రాణానుజుట్టి నలుదెసలం గ్రమ్ముకొనెను.ఆయడవి కొండలతో నిండిన సమప్రదేశము లేక నిమ్నోన్నతముగ నుండుటచే నిలిచి యుద్ధము చేయుట కిద్దఱకు వీలు లేదయ్యె. ప్రతాపుఁడు దాఁగొని యున్న కారడవికి సమీపమున హల్దిఘా టనుబయ లుండుటచే నది యుద్ధమునకు దగినభూమి యని యిరువు రచ్చటఁ జేర నిశ్చయించి 1576 వ సంవత్సరము జూలై నెలలో జేరిరి.

ప్రతాపవంతుఁడగు ప్రతాపుఁడు కైటక మను పేరుగల తన గుఱ్ఱము నెక్కి రాజలాంఛన మగు శ్వేతఛత్రమును సేవకులుపట్ట కవచము ధరియించి ఖడ్గపాణియై యుద్ధమున నిలిచినతోడనే ప్రాణము లెంతో తీపి యని చావునకుఁ బెఱచి మూలదాఁగొన్న పిఱికి సయితము తెగించి కత్తిఁ బూని తన రాణాకుఁదోడు పడియెను. శత్రు సైన్యములఁ జూచినతోడనె మనోనిశ్చలమగు ప్రతాపునిచునస్సుఁగూడ నించుక జంకెను, దీనింబట్టి యక్బరు పంపిన గొప్పఫిరంగులు సాధనములు మహాయంత్రములు మొదలగువానిం జూచి రాణా జంకెనని మనము దలఁపరాదు. అన్నను జంపుటకు తమ్ముడును తమ్ముని దెగటార్చుట కన్నయు నొండొరులం జంపుకొనుటకుఁ జుట్టములు నచ్చంట. జేరినందు కతఁడించుక వగచె. ఆ మహా సైన్యములో ప్రతాపుని సోదరుఁ డగు సూక్తుఁ డొక మూలనుండెను. మఱి యొక సోదఱుఁ డగుసూగ్రుని కుమారుఁకు కొంత సేన కధిపతియై నిలిచెరు. చక్రవతి౯ పుత్రుఁడగు సలీము రాజపుత్రుల యాఁడుపడుచు కోడుకే గదా ! ఈ సేనాచక్రము నంతను దిప్పుచున్న యంబర రాజపుత్రుఁడు మానసింగు ప్రతాపునకుఁ జుట్టమేకదా? అతనిం జూచినతోడనే ప్రతాపుఁడు రోషావేశ పరవశుఁడై యుద్ధమేమయిన సరే కాని వానిపై కసితీర్చుకొనవలయునని ప్రతిన చేసెను.