పుట:Raajasthaana-Kathaavali.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్ధము

151


మానసింగు వినయముగ వర్తమాన మంపెను. అప్పుడు ప్రతాపుఁడు కమలమియరు కోటలో నున్నందున వాని నక్కడ కలిసికొన ననియు నుదయ సాగర మను రసస్సుతీరమున గలిసికొందు ననియు, వర్తమాన మంపెను, దానికి సమ్మతించి మానసింగు సపరివారముగ నటకుం జన, వాని నేదుర్కొనుటకుఁ బ్రతాపుని పెద్దకోడు కగు ఉమ్రా యనునతఁడు మీవారు ప్రభువులను దోచుకొని యక్కడకు వచ్చెను. వచ్చి మానసింగును సమ్మానించి తలనొప్పి బాధచే రాణావారు స్వయముగ రాలేక తన్నుఁ బంపిరని చెప్పి పిండివంటలు చేయించి విందార గింపుమని వానిం బ్రార్ధించె.

ఉమ్రాకు నక్కడ నున్న తక్కిన రాజపుత్రులను బ్రతాపుఁడు స్వయముగ వచ్చి మానసింగునకు నెందుకు విందు సేయ లేదో కారణము తెలియదు. అంబరు రాజులు తురకలతో వియ్యమందుటచే ప్రతాపుడు వారి పం_క్తిని దినఁడు. ఆసంగతి గ్రహించి మానసింగు "ప్రతాపుని తలనొప్పి కారణము నే నేఱుఁగుదును. అతఁడే స్వయముగ వచ్చి నాకు విందు సేయవలయును కాని వానిష్ఠానమున వేఱోకరు పనికిరా” రని పలికెను. ఆ పలుకులు విని ప్రతాపసింగు నిర్భయముగ నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. తనయింటి యా డుపడుచును దురక కిచ్చి పెండ్లి చేసి వానితోఁ గలిసి కూడుదిను నతనితో నేను భుజియింప జాల.

ఆపలుకులు విని గ్రోధలజ్జా పరవశుఁడై మానసింగు విందారంపకగి దిగ్గున లేచి "దేవున కారగింపు చేసి తెచ్చినయన్న మేగాని మీ చేతియన్నము నేను దినను. మీ మానములఁ గాపాడుటకే మీ రాజ్యములు నిలుపుటకే మేము తురకలతో వియ్య మంది వారికూడు తిను చుండుట. సరేయింకి మీఁద నీవే మాత్రము పౌరుష శాలివో చూతము కాఁచుకోమ్ము" అని పలికి తన పరిజనుల నుందరిని లెమ్మని పయన మయి పోవుచుండ నింతలో ప్రతాపుఁడీవలకు వచ్చి మానసింగును