పుట:Raajasthaana-Kathaavali.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్ధము.

145


నడుమ మాతండ్రి యుదయసింగు లేకుండ నేనే సంగునికుమారుఁడ నైనపక్షమున గొడ్డు మాంసము తినుతురక వాఁడు వచ్చి యీ దేశమున నడుగు పెట్టఁగలఁడా. రాజపుత్రులను లోఁబఱచుకొనగలఁడా.”

మీవారు రాజ్యమునకు స్వాతంత్రయము దేవలయునని ప్రతాపునకు గోరిక యున్నది; కాని యది నెఱవేఱుట యసాధ్యము. ఏలయనఁ బ్రతాపసింగునకు ఢిల్లీ చక్రవతి౯ సైన్యములెకాక స్వబంధు జనములలో గూడ శత్రువు లుండిరి. మార్వారు, బూందీ, బికనీరు, అంబరు మొదలగు సంస్థానముల యధిపతులు చక్రవతి౯కి దాసులై యుండిరి. అందు బూందీ సంస్థానప్రభువుదక్కఁ దక్కినవారు దాసు లగుటతోఁ దనివి నోందక తమ యాడుపడుచులఁ దురక కిచ్చి పెండ్లి గూడ చేసిరి. వారిమాట యేల ? ప్రతాపుని సోదరులలో నొకఁ డగు సూగ్రుఁ డనువాఁడు తన యన్నను విడిచి యక్బరు చక్రవతి౯ శరణంబు సోచ్చి యాతని చేత నేలుటకు గ్రామంబులం బడసి మా న్యుఁడై యుండె. అతఁడును బిడ్డలును సూగ్రవతు లను పేరఁ జక్రవతి౯ కొఁలువు లో బ్రతిష్ఠితులై యుండిరి . మీవారు దేశము నిరంతర యుద్ధములచేత ధనశూన్య మగుటయేగాక మాయుధ శూన్యమై వీర శూన్యమై యడవియటు లుండె. అయవస్థలో మహావీరుఁ డగు ప్రతాపుఁ డొక్కఁడు చక్రవతి౯తో బగ సాధించెనుగాని మఱి యొకఁ డైనపక్షమున సందుదొరికినదే చాలునని చప్పుచప్పునఁ చక్రవతి౯తో సంధి చేసికొని యాతని మన్ననలనుం బాత్రుండై సుఖముగ నుండి యుండును.

మివారు దేశములోఁ బుట్టిన రాచవాఁడు ఢిల్లీ చక్ర వతి౯కి లొంగి సలాము చేయఁగూడ దనియు వానిని తాము గెలువ లేకపోయినను తఱిమి దోఁచుకొని బెదరగొట్టి సిలుగులం బెట్టవచ్చు ననియు వీలుదప్పివచ్చినప్పుడు గౌరవముగ రణముఖంబునఁ జచ్చి వీరస్వర్గము జూఱగోనవచ్చు ననియు నందుచే సంధి చేసికొనగూడ దనియు వాని