పుట:Raajasthaana-Kathaavali.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

రాజస్థానకథావళి.

యభిప్రాయము. ఆయభిప్రాయముంబట్టి తురకలను స్వదేశమునుండి వెడలఁగొట్టి మీవారును తొల్లింటి గొప్పదశలోకిం దెచ్చువఱకుఁ గడుపారఁ గూడు తిన ననియుఁ గంటినిండి నిదురపోననియు నతఁడు ప్రతిన జేసెను.

ఇట్లు సంకల్పించి యాగడియ మొదలు ప్రతాపుడు సంకల్ప సిద్ధి యగువఱకు కొన్ని నియమముల నేర్పఱచుకొనియెను. సేన బయలుదేరునపుడు ముందుమోవు రణదుందుభు లది మొదలు వెనుక వాయింపవలయును. శత్రువులను జయింప లేని పిఱికి వాని రణదుందుభులు వెనుక నుండవలయునేగాని ముం దుండదగ వని యిట్లు చేసెను.2. రాణావారు భోజనము చేయు వెండిబంగారు పళ్ళెములు పాత్రములు తీసి వేయించి తనకును తనతోడిసామంత ప్రభువులకును శత్రునాశనము సేయువఱకు భోజనాథ౯ము విస్తళ్ళు చాలు నని యానతిచ్చెను.3. ఆయన నిత్యము పవ్వళించు హంసతూలికాతల్పము లవ్వలఁ బాఱవైచి తనగుఱ్ఱమును శత్రువులకోటలోఁ గట్టివేయువఱకుఁ దాను గడ్డి పాన్పుమీఁద నే పండుకొనునట్లు శపధము చేసెను. 4. చిత్తూరు నగర మెప్పటియట్లు రాజస్థానము నకు దీపమై వెలయునంతవఱకు ప్రతాపుఁడు తాను తన సామంతులు గడ్డములు కత్తిరించుకొనఁ గూడదని శాసించె. ఆదినము మొదలు చిత్తూరు రాజధానిం జేసికొను వఱకు మఱల రాజధానిలో నుండఁగూడ దని యుదయపురమును విడిచి కమలమియరుకోటలోఁ గాపురముండి యెందేని బోవలసివచ్చినప్పుడు గుడారములోనే వసించుచు వచ్చెను.

ఇట్లు సంకల్పించినతోడనే మున్ను తనతండ్రి మూర్ఖత వలన యన్యకుటుంబఘనకు బోయిన తసతమ్ముని సూక్తుని రావించెను. ఆబాలుని పెంచుకొన్న తండ్రికి ముసలితనమున గొడుకు లనేకులు పుట్టినందున దత్తపుత్రుపై మోహము తగ్గెను. కావున సూక్తుఁడును పాలక పితను విడిచి వచ్చుటకు వగవక కడుసంతోషమున నన్న వద్దకు