పుట:Raajasthaana-Kathaavali.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

రాజస్థానకధావళి.


గ్రహింపనివారు వెలవెల బారి చూచుచుండిరి. ఇంటికి వచ్చిన యతిథికి హాని చేయుట రాజపుత్యధర్మ విరుద్ధము, హాని చేయక యుండవలయునన్న దుర్భేద్యమై పోతుటీఁగ 'కైనఁ జోర రాక సింహగుహ యని చెప్పఁదగిన యాకోటలోనికిఁ దనకుఁ దానై చక్రవతి౯ వచ్చి లోటుపాటుల నెల్ల గ్రహించెగదా ! చక్రవతి౯ మాట యటుండ తమ కంత మహాద్రోహము జేసినమానసింగు నేమి చేయవలయు నని యక్కడ నున్న రాజపుత్రుల కందఱకు సందేహములు దోఁ చెను.

రాజపుత్రు లిట్లు కళవళ మందుచుండ నక్చరు నదరు బెదరు లేక నిర్భయముగఁ గూర్చుండి కొంతసేపటికి గంభీరమగుస్వరముతో 'సూర్జనా ! ఇప్పుడు కత౯వ్యమే' మని యడిగెను. సూర్జునుఁడు తెల్లఁబోయి యప్పలుకుల కేయుత్తర మిచ్చుటకుఁ దోఁచకయుండ మాన సింగు ధైర్యము తెచ్చుకొని కత౯వ్య మేమున్నది? రంతంబారుకోట దేవరవారికి సమర్పించి సూర్జనుఁడు మీవాఁడై గౌరవ మందుటయే'యని పలికెను. చేయున దేమియు లేక కోట యక్చరున కప్పగించి తొలఁగెను. ఈ విధముగ బంధుద్రోహము చేత రంతంబరుకోట మొగ లాయీలపా లైనదని రాజస్థాన చరిత్ర కారులు వ్రాసిరి. అట్టి యవస్థలో నెంతటి మానవంతుఁ డైన నట్లే చేయవలసి యుండును గదా? రాజస్థానమునందలి సంస్థానములు తమలో తమ కైకమత్యము లేక దేనిమేలు నదియే చూచుకొనుచు బనిచేయుటయేగాని యావద్దేశము యొక్క మేలును జూడక పోవుటచే స్వనామమును గ్రమక్రమముగఁ దెచ్చుకొనఁజొచ్చెను. దేశమునందు గల శూర శిఖామణుల నెల్ల రావించి దేశాభిమానము గలిగించి యుద్ధములు చేయింపఁ గల సమర్థుఁడు రాణా సంగుఁడు గతించుటయు సూర్యవంశపు రాజుల గద్దె యెక్కుట కనర్హుఁడగు నుదయసింగు రాజగుటయు నాశనమునకు ముఖ్య కారణములు. అక్బరు చూపిన సాహసమును మనోధైర్యమును 'రతంబరు' కోటలో నున్న వారి కత్యద్భుత