పుట:Raajasthaana-Kathaavali.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్ధము.

139


మును గలిగించెను. విశేషించి యతఁడు ధీరోదాత్తుఁడగు పగతుడనియు నీచశత్రువుఁడు కాఁడనియు వారికి దోచెను. మఱియు నతఁడు రాజపుత్రస్త్రీని వివాహము జేసికొని యామేను తన మతములో గలియు మని బలవంత పెట్టక యామె యిచ్చవచ్చిన దేవతల నారాధిం చుకొనవచ్చు నని సెలవిచ్చుటం జేసి యాచకవతి౯ మహోదారుఁడని యా రాజపుత్రులు గ్రహించిరి. బూందీసంస్థాన ప్రభువు లదివఱకు మీవారు నిమిత్తము పోరి చాల నష్టపడిరి, అందుచే నక్బరు వారియభిమానమునకు లోపముగలుగకుండునట్లు సంధిఁ జేయఁదలంప 'సూర్జ నుఁడు' సంతోషముతో నంగీకరించెను. ఆసంధి నిబంధన లివి. సూర్జనరావు తన యేఁబది రెండు జిల్లాల నెప్పటియట్లు పాలించుకొనవచ్చును. అవసర మగునపుడు ఢిల్లీ పాదుషా కుఁ గొంత సేన నతఁడు పంపవలెను. బూందీ రాజులు మొగలాయిలకు నెప్పుడు తలపన్ను నీయనక్కఱ లేదు. చక్రవతి౯ బూందీ ప్రభువులను సింధునది దాఁటి యావలకు యుద్ధములకుఁ బంపఁగూడదు. బూందీ రాజకన్యను 'మొగలాయీలు పెండ్లియాడఁ దలంపఁకూడదు. బూందీ వారి భేరీలు ఢిల్లీ కోటగోడల నడుమ వాయింపవచ్చును. ఆ రాజులు ఢిల్లీ చక్రవతి౯ దర్చారు బ్రవేశించునపుడు తమ యాయుధముల నెల్ల ధరించి యుండవచ్చును. చక్రవతి౯కి దక్కిన రాజులం బలె నేల సాగిలంబడి మృక్కనక్కఱ లేదు. షరతు లింత యనుకూలముగ నున్నపుడు సూర్జునుఁడు వాని కంగీకరించుట యొక వింత కాదు. కాని యతఁడు సమ్మతించిన మాత్రమున పోరణఁగ లేదు. ఏలయన తొల్లి బహదూరుషా యాకోటం బట్టుకొన్నపుడు వానివద్దనుండి 'శాంతహారుఁ' డనునొక రాజ పుత్రవీరుఁడు దానిని వదలించి సూర్జనరావున కప్పగించి మివారు రాణాలకు లోబడి దాని నేలుకోమ్మని చెప్పెను. అందుచే నతఁ డిప్పుడు జరిగిన స్వామిద్రోహమును సహింపక సూర్జనుఁడు చేసికొన్న సంధి కొడంబడక చక్రవతి౯ నెదిరింప నిశ్చయించుకొనెను. కాని యతనివద్దనున్న సైన్య మతిస్వల్ప