పుట:Raajasthaana-Kathaavali.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్దము

137


వతి౯ యీ కోటను కొంత కాలము ముట్టడించి పట్టుకొనలేకపోయెను. దానికిఁ దోడుగ నతఁడు కార్యాంతరము లమీఁద మఱియొక చోటికి బోవలసివచ్చినందున నీ ముట్టని నాప దలంచు చుండెను. అంతలో నక్బరునకు నమ్మక బంట్లును రాజస్థానమునకు ద్రోహులు నగు నిరువురు రాజపుత్రులు మోసము చేసి యీకోటం, జక్రవతి౯ కప్పగించిరి. అంబరు దేశ ప్రభువగు భగవాను దాసుఁడును వాని యన్న కొడు కగు మానసింగు నను వారే యామహానుభావులు. ఈయిద్దఱు ద్రోహము చేయనిపక్షమున రంతంబరుకోట శత్రుదుగ్గమమై నిరపాయస్థితి నుండి యుండునుగదా!

సూర్జనునిఁ గలిసి మాటలాడిన పక్షమునఁ జక్రవతి౯కి జాల లాభము గలుగు నని నమ్మి మానసింగు దర్శనము చేసి మాటలాడ వలయు నని యున్నది గనుక కొంతకాలము వఱకు యుద్ధము మానవలసిన దని సూర్జనునకు వత౯ మాన మంపెను. సూర్జనుఁ డందుకు సమ్మతించినందున మానసింగు తాను చక్రవతి౯ రాయబారి నని పేరు పెట్టుకొని కొంత పరి వారముతోఁ గోటలోనికి బోయి యాతని చేత సబహుమానముగ గౌరవింపఁబడెను. మానసింగును సూర్జనుఁడు నొండోరులతో సంభాషింపుచుండ హఠాత్తుగ సూర్జనుని మేనమామ కూర్చున్న చోటునుండి లేచి రాజా మానసింగు యొక్క వెనుక నిలిచియున్న చోపుదారు వంకఁ జూడఁదొడంగెను. అటు కొంతసేపు చూచి యతఁడు సోపుదారు చేతిలో నుండి వెండికఱ్ఱను వినయమునఁ దీసికొని సూర్జనుఁడు సాధారణముగాఁ గూర్చుండుస్థలమున నాచోపుదారుంగూర్చుం డఁబెట్టెను. అపు డందఱు తెల్లబోయి చూడఁ దొడఁగిరి. నిగనిగ లాచునట్టి యాకాటుక కన్నులును మేని చామనచాయను ముక్కు, మీఁద నెడమ పక్క నున్న పుట్టుమచ్చను జూచి యతఁడు తప్పక యక్బరుచక్రవతి౯యని మున్ను వాని నెఱింగిన వారు కొందఱు నిశ్చయించిరి కాని గ్రహించిన వారు సందేహించి చెప్పక యూరకొనిరి.