పుట:Raajasthaana-Kathaavali.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

రాజస్థానకధావళీ,


వారిప్రయాణములు వారి గుఱ్ఱముల బలమునే యాధారము చేసికొనియుండెను. అవి కదలలేక పోయిన వారిప్రయాణములు తుద ముట్టినవని చెప్పవచ్చును. మాగ౯ మధ్యమున వడగొట్టి యెవఁడై న పడిపోయెనా వానిగతి యంతే. కాని తక్కిన వారు వానికొఱ కాగుటకు వీలు లేదు. ఒక నాటి యర్థరాత్రమున హుమాయూను గుఱ్ఱము నెక్కి స్వల్ప సేనాపరివార సమేతుఁడై కుటుంబము తోడ్కొని యమరకోట యను నగరమును జేరుటకుఁ బయనమై పోవు చుండెను. అప్పుడాయన యెక్కిన గుఱ్ఱము మార్గా యాసమునఁబడి చచ్చెను. చక్రవతి౯ తనకుం దోడై వచ్చుచున్న 'టార్ డీ బేగ్' అనువాని యొద్దకుఁబోయి దృఢముగా నడచుచున్న యాతని గుఱ్ఱమును తనకిమ్మని యడిగెను. చక్రవతి౯ యాదినములలో మిక్కిలి యల్పుఁడగుటచే 'టార్ డీ బేగ్' వానిమాట లెక్క సేయక నిర్దయాత్ముండై నియ్యను పొమ్మని బదులు చెప్పెను.

మాల్దీవు యొక్క సైనికులు హుమాయూనుం బట్టుకొనవలెనని వెను వెంటఁ దరుముకొనివచ్చుచుండిరి. కాబట్టి యెక్కుటకు గుఱ్ఱమైనను లేని యాచక్రవతి౯ వెంటనే యపాయము తప్పించుకొనుట కొక యొంటె నెక్కెను. అతనియవస్థఁజూచి జాలినొంది పరిజనులలో నొకఁడు నీడంకోలాయను వాఁడు గుఱ్ఱముమీదనుండి తనతల్లిని దింపి యాగుఱ్ఱమును జక్రవతి౯ కిచ్చి చక్రవతి౯ యెక్కిన యొంటె మీద యామె నెక్కించి యామె పక్కనే పాదచారియై తానునడచెను. వారు పోయెడు దారి జలశూన్యమగు గొప్ప యడారియగుటచే దాహమునకు నీరు దొరకక కొందఱు మృతులైరి. కొందఱు పిచ్చివాండ్రయి కేకలు వేయ నారంభించిరి. ఆక్రందనధ్వనులతోడను హాహాకారములతోడను నింగి నిండిపోయెను ఈ కష్టములకు దోడు పగవారు దాఁపునకు వచ్చిరను వత౯మానము దెలిసెను, యుద్ధము చేయఁగలవారి నందఱిని పయనము మానిపించి తనవద్దనుంచి స్త్రీలను