పుట:Raajasthaana-Kathaavali.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవముట్టడి

123


సామగ్రులను సాగిపొమ్మని పంచెను. శత్రువు లెంత సేపటికి రానందున చక్రవతి౯ " తనకుటుంబ మెట్లున్నదో చూచుటకు ముందు వెళ్ళేను. ఆ కారుచీఁకటిలో హుమాయూను సైనికులలోఁ గొందఱు దారితప్పి శత్రువులకంటఁ బడిరి, అప్పుడు రాజపుత్రులకు మొగలాయిలకు నొక చిన్న యుద్ధము జరిగెను. మొగలాయీలు ప్రాణములపై నాసవిడిచి ఘోరముగఁ బోరి రాజపుత్ర సేనాపతిం జంపి సేనం బారదోలి వారియొంటెలను గుఱ్ఱములను సామగ్రులను దోఁచుకొనిరి.

ఎన్ని దొరకినను మూఁడుదినములవఱకు నీటి చుక్కయైన వారికి దొరకదయ్యె. నాలుగవనాఁడు వారికిఁ గన్నులపండువుగ నొక బావి గనఁబడెను. అది యెంతలోతున్నదో చెప్పఁ జాలముగాని మోటఁ గట్టి నీళ్లు తోడు నపుడు బొక్కెన పైకి వచ్చిన దని మోట యెడ్లను తోలువానికి తెలియఁ జేయుటకై మాట వినఁబడక పెద్ద భేరీ వాయించవలసి వచ్చెను. ఇట్లతిప్రయత్నమున వచ్చిన యానీటి నిమిత్త మదివఱకే నోళ్లు తెఱచుకొని యున్న యాజనులలోఁ గొందఱు దాహాతురులై నిలువ లేక తిన్నగా బొక్కెన నూతియంచువఱకు రాఁక మునుపే దాని పయిం బడి నీరు త్రాగఁబోవ 'వెంటనే యాత్రాడు తెగి బొక్కెన నూతిలో బడెను. బొక్కెనతోఁ గూడ కొందఱు మనుష్యు లానూతిలో బడి మృతినొందిరి. కొందఱు మితిమీరిన దాహ బాధ కాగలేక నాలుకలు దెఱచుకొని, వగర్చుచు వేడియిసుక పైఁ బడి దోల౯సాగిరి. మఱికోందఱా బాధ కోర్వలేక నూతిలో గుభాలున నుఱికి తక్కిన వారికంటే త్వరగా ప్రాణములు విడిచి సుఖపడిరి. మరునాడు వారు మరల నొక నీటి పట్టుం జేరిరిగాని వారిదురవస్థ వెనుకటి దినముకంటే తక్కువ కాలేదు.

అదివఱకు చాలదినములనుండి నీరు దాగి యెఱుఁగకపోవుటచే నోంటెలు నీరు పోసిన తోడనే మితి మీరఁ ద్రావి యొక్కనముచే యెన్నియో తక్షణమే మృతినొందెను, ఆయోంటెలవలెనే మనుష్యు