పుట:Raajasthaana-Kathaavali.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయసింగుని కథ.

113


ఆ బాలుఁడు కోమటి యనుకొని వానిని పంక్తి బాహ్యుఁడుగా నెంచి యాపలకుఁ బొమ్మని రాజపుత్రులు కొందఱు బ్రతిమాలిరి. కొందఱు వేఁడుకొనిరి. కొందఱు బెదరించిరి. బాలుఁడు వేడికోలు వినిపించు కొనఁడయ్యె. బెదరింపులకు బెడరఁడయ్యె. అనాసా యాబండబాలు నేమియు సేయ లేక యూరకొనియె నని కొందఱు తలఁచిరి. అందులో నొక రిద్దఱు బుద్ధిమంతులు బాలుని యొద్ద కోమటిగుణము లేవియు లేకపోవుటచే నతనికి నసాసాకు నేమియు సంబంధము లేదని నిశ్చయించిరి.

అనంతరము కొంత కాలము జరుగ నొకనాడు కమలమియరు మార్గమున నొక రాజపుత్రుఁడు మార్గవశమునఁ బోవుచుఁ దనరాక నసాసాకు దెలియఁబరచెను. వానిని సగౌరవముగాఁ దోడి తెచ్చుట కసాసా తన మేనల్లుని పంపెను. రాజచిహ్నములు ధీరలక్షణములు గలయా బాలునిముఖ వైఖరిఁ జూచి యావచ్చినయతం డాశ్చర్యపడి యతఁ డసాసా కు చుట్టము గాడని నమ్మి వానివృత్తాంతము దెలుపుమని యసాసాను నొక్కి యడిగెను. అసాసాయుఁ దగినపని చేయవలసిన కాలము వచ్చిన దని గ్రహించి యాబాలుఁడు తన మేనల్లుఁడు కాఁ డనియు సంగుని మూడవ పుత్రుఁ డగునుదయసింగనియు జెప్పి నిజము నొప్పుకొనియెను. ఈవచ్చిన రాజపుత వీరుఁడు తొల్లి రాణా హమీరును వితంతువయిన తనకూఁతు నిచ్చి వివాహము చేసి వంచించిన మాల్ దేవుని వంశస్థుఁడు. సోనిగుఱ్ఱయను సంస్థానమునకు ప్రభువు.

ఈకొండగోటలో సంగునికుమారుఁ డగునుదయసింగు వసించుచున్న వాఁడన్న వాత౯లె దేశ మంతటకొలఁది కాలములో నలముకోనెను. ఆమాట నిజమో యబద్ధమో తెలిసికొని రాజపుత్రుని కన్నులార చూచుకొనుటకై మీవారునుండియుఁ దక్కిన సంస్థానములనుండియు రాజపుత ప్రభువులు విరామము లేక కమలమియకునకు రాదొడగిరి.ఇటు లుండ చందావతుకులస్థుఁ డగు రాజపుత్ర ప్రభువు వనవీరునివలన