పుట:Raajasthaana-Kathaavali.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

రాజస్థానక థావళీ.


పరాభవము నొంది వానిని విడిచి కమలమియరుకోటకు వచ్చి రాజపుత్రుని కలిసికొనెను. వాని పరాభవ కారణ మిది. పూర్వమునుండి మీవారు రాణా రాజబంధువులను విందులకు పిలిచినప్పుడు తన కెవ్వరి మీఁద నత్యంత గౌరవము గలదో వానిని గౌరవించుటకు తనకంచము లోనుండి కొంచె మెంగిలియన్నము వానికిఁ బంపుట యచారమయి యుండెను. ఈయచారము రాణా సరిగా నడుపనప్పుడు రాజపుత్ర వీరు లనేక పర్యాయములు రాణాపైఁ గోపించుచు వచ్చిరి.

ఒకమా రొక రాజపుత్ర వీరుఁడు తనకు రాణా పంపవలసిన యన్నము మఱియొకనికి పంపుటచే గోపించి విందారగింపకయే లేచి పోయెను, వనవీరుఁడు తనస్థితిని మఱచి తాను నిజముగా రాణాయే యనుకొని యాయాచారమును సడుపజూచి తన యెంగిలి యన్నము మివారు ప్రభువులగు కొందఱికి పంపఁగా వారాయుచ్ఛిష్టమును గుడువక యూరకొనిరి. అభిమాన ధనుఁడగు చందావతు వంశజుని గారవించుటకు మఱియొక మా రెంగిలి యన్నమును పంప కొపోద్దీపితుఁడై యాకంచముపొత్తును నిరాకరించి మీరు మిక్కిలి యిట్లని వానికి వత౯మాన మంపెను. "బప్పరావుల వంశస్థుని యుచ్ఛిష్టము దినుటయే మాకు గౌరవము కాని దాసీపుత్రుని యెంగిలి కూడు తినుట మాకు గౌరవముకా” దని చందావతువంశస్థుఁడు చివాలున లేచి తనియూరికిఁబోయి వనవీరునకు లోఁబడక వానిని రాజ్యభ్రష్టుని జేయుటకై యోచించుచు సంగునికుమారుఁడు కమలమియరుకోటలో నున్న వాడని విని మహానందభరితుఁడై యచటికిఁ జనియె. ఆమహావీరునితోఁగూడ ననేక రాజపుత్రు లాకోటకుంజని కొలువుదీర్చి కత౯వ్యము విచారింపఁ దొడంగిరి. అప్పుడు పున్న వెనుకటి మంగలిం దోడ్కొనివచ్చి యాకొలువుకూటమున నిల్చి రాజపుత్రుని పూర్వవృత్తాంత మంతయు వానికిం బూసగుచ్చినట్లు చెప్పి వనవీరుఁడు విక్రమజిత్తును వధించిన నాటిరాత్రి చంపఁబడిన బాలుడు