పుట:Raajasthaana-Kathaavali.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

రాజస్థానకధావళీ.


కుత్సాహము గలిగించెను. అసాసాతల్లి పలుకులచే రోషముఁ దెచ్చుకొని వారి కభయ మిచ్చెను. కాని మహాసాసికురా లగునాస్త్రీ యింత కంటే నెక్కువ కష్ట మగుపని యొకటి చేయవలసియుండెను. ఉదయసింగు నాఁడు మొదలుకొని యసాసాయొక్క మేనల్లుఁ డని చెప్పుటకు వారు నిశ్చయించిరి. అసొసా కోమటి యగుట చేత నతనివద్ద రాజపుత్రస్త్రీ, పరిచారికగా నుండిన లోకు లనుమానింతురు. అది కారణ ముగా తన కొడుకునై నం జంపుకొని వానినే నమ్ముకొని యున్నయా దాదీ యాబిడ్డను విడిచి పోవలసివచ్చెను. బాలకుని విడువలేక విడువ లేక పున్న యెట్టెటో విడిచికన్నులు వాచిపోవున ట్లేడ్చి యెక్కడ నైనం బాలుఁడు బాగున్న చాలునని యధేచ్ఛం జనియెను.

ఆకొండలలో నుదయసింగు పెరుగు చుండ బందుగులందఱు నతఁడు వనవీరుని చేతిలో మృతినొందినాఁ డని యొక్క యేడు పేడ్చి యూరకోనిరి. వనవీరుఁడును రాజకుటుంబములో వారినందఱఁ గడతేర్చి తనపదవి దిట్టపరచుకొని తాసు దాసిపుత్రుఁడనుమాట మరచి రాజపుత్ర ప్రభువుల యనుగ్రహము చేతఁ దన కింత మహైశ్వర్యము పట్టిన దని తలంపక తా నాగర్భశ్రీమంతుఁడే యనుకొని గర్పించి తిరుగఁజొచ్చెను. అతని రాజ్యసంరక్షుకునిగా నేర్పఱచిన రాజపుత్ర ప్రభువు లందఱుఁ దమచేసిన లోపమునకు పశ్చాత్తాపము నొంది రాజపుత్ర వంశమెల్ల నిర్మూలిక పఁబడిన దనుకొని చేయునది లేక యెట్టెటో యేడుసంవత్సరములు వానిపాలనకు లోఁబడి యుండిరి.

అటులుండ నొకమా రొక పండుగకు కమలమియరుకోట కనేక బంధువులు వచ్చి యసాసా చేత సత్కరింపబడి విందులనారగించిరి. వచ్చిన రాజపుత్రుల కందఱకు లోపల మందిరమునను తన వర్ణమువా రగువత౯కులకు మఱియొక మందిరమునను నతఁడు' వడ్డనలఁ జేయించెను. భోజనముల వేళ నసాసా మేనల్లుఁడు రాజపుత్రుల బంతిలోనికి బోయి యచ్చట నొకకంచములో పెరుగన్నము తిన నారంభించెను.