పుట:Raajasthaana-Kathaavali.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు రెండవముట్టడి

97


ఈనగరమును గాపాడుట కామీవారు రాజపుత్రులకు రాజ స్థానమందున్న రాజు లందఱు సాయపడిరి. కణ్వాహాయుద్ధమున దమవా రనేకులు నిహతు లయినను, హతశేషు లగుచందావతువంశస్థులు చిత్తూరు సంరక్షణమునకు మరల సిద్ధపడిరి. ఆబూపర్వతము వద్ద నుండి యా ప్రాంతముల నేలుచుండిన రావు వచ్చి మీవారునకుఁ దోడు సూపెను, అట్లే మఱి యిదువురు రాజులును దమ ప్రాంతపగల మరచి యీయదనున వచ్చి మీవారునకు బాసటయై నిలిచిరి. వెనుకటిరాణా యగు రత్నసింగు బూందీసంస్థాన ప్రభువగు వెనుకటి రావును వేటాఁడు వేళ జంపెను. అతని వెనుక సింహాసకమునకు వచ్చిన యర్జునరావు మనసులో నామాట నుంచుకొనక మెరియలవంటి తన సైనికుల నైదు వందల మందినిఁ దోడ్కొని చిత్తూరునకు వచ్చెను. పృథివిరాజునకును వాని పినతండ్రి యగు సురేశమల్లునకును నెంతెంత మహాయుద్ధములు జరిగినవో పృథివి రాజు సాహసములఁ జదివిన వారంద ఱెఱుంగుదురు. ఆసురేశ మల్లునికొడుకు భాగ్జీ యనునతఁడు గతించిన కార్యముల దల పక తనతండ్రిని చిత్తూరు రాణాలు 'దేశమునుండి వెడలఁ గొట్టిరని క్రోధమునైన నిలుపక దేవలకోటనుండి కొంత బలముం దోడ్కొని వచ్చెను. ఈపైన పేర్కొనఁబడిన శూరులేగాక మఱియు ననేక ప్రభువులు కత్తిఁగట్టుకొని వచ్చి చిత్తూరును సంరక్షించు చున్న యా దేవత యూపత్కాలమున రాజవంశస్థులను గాపాడక పోదని నమ్మి యుత్సాహముతో రణోన్ముఖులైరి కాని ప్రపంచయిలో నున్న శౌర్యమంతయు ముద్ద చేసి యొక చోటికి చేర్చినను బహదూరుషా యొక్క ఫిరంగులముందట నెందుకుం గొరకాదు.

ఆతురక రాజు తన గొప్పఫిరంగులను కోటబురుజుల సమీపమునకు లాగించుకొనిపోయి వాని సేనలో బనిఁ జేయుచున్న పోర్చుగీసు వారి చేతఁ గడు నిపుణముగఁ బని జేయింపఁ జొచ్చెను. ఒక మూల నుండి దారుణము లగుఫిరంగి గుండ్లు కోటలోనున్న మనుష్యులమీద