పుట:Raajasthaana-Kathaavali.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

రాజస్థానకధావళీ,


బడి నాశనము చేయుచుండ రెండవమూలనుండి మఱికొన్ని గుండ్లు వచ్చి కోటగోడలను గుభాలు గుభాలు మని పడఁగొట్టఁ జొచ్చెను. పూర్వ మలాయుద్దీను ముట్టడించినప్పుడువలెనే యిప్పుడును దక్షిణ దిక్కున నున్న కోటభాగము బలహీనమై యుండెను. ఆవైపు బురుజు మీఁద బూందీప్రభు వగు నర్జున రావు తనయైదువందలమంది సైనికులతో నిలిచెను. తురకసేనలో నున్న పోర్చుగీసు దొర యాబురుజుల కెదురుగా నేల సొరంగము ద్రవ్వి యందు తుపాకిమందు కూరి దాని నంటించెను. ఆగని బ్రహ్మాండము గడగడ వడఁకునంతటి ధ్వనితోఁ బగిలి దక్షిణ దిక్కున నున్న కోటగోడను నలువదియై దుమూళ్ల పొడుగున గుభాలున కూల్చెను. అతి ధైర్యముతో నాభాగమును గాపాడుచున్న యర్జునరావును వాని జోదులును పేలిపోయి యానవాలైన లేకుండ నశించిరి. ఈరంధ్రమునుండి మహమ్మదీయులు కోటలోఁ బ్రవేశింపఁ జూచుచుండ వీర రసావతారు లగుచందావతువంశస్థు లక్కడకు వచ్చి శత్రువులు లోనఁ బ్రవేశింపకుండఁ బోరిరి. ఎక్కడనుండి యైనమఱి కొంతసేన దోడు వచ్చినఁగాని చిత్తూరుకోట నిలువదని యందఱు గ్రహించిరి. అప్పుడు ముఖ్య సేనానాయకు లందఱు గూడి సభ , జేసి యాయాపద గడువంబెట్టుట కుపాయము 'వెదుకఁ జొచ్చిరి. వారికి మొట్టమొదట యాలోచన చెప్పినది విక్రమజిత్తు తల్లి యగు జవా హీరుభాయి. ఆమెమగఁడు పోయిన స్వల్ప కాలములోనే తన సవతికొడుకును 'రాజృభ్రష్టునిఁ జేసి తనకుమారుని 'రాజుని జేయుమని తురక చక్రవతి౯ని బ్రతిమాలినందుకు నిటీవలఁ జాల పశ్చాత్తాపము నొంది యాసమయమున తనకుమారుని లాభమునుగాని తనలాభమునుగాని జూచుకొనక మీవారు యొక్క జిత్తూరుయొక్కయు గౌరవమును గాపాడుకొనుటకు సమస్తవిధములఁ బాటువకి తాను యుద్ధమునకుఁ బోవుదు నని సేనానాయకులతోఁ జెప్పి వారి నొప్పించి తనమందిరమును తనగోషాను విడిచి కవచము దోడుగుకోని యా యుధముల