పుట:Raajasthaana-Kathaavali.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు రెండవముట్టడి.

3


యతఁడు కోటకావలి వాండ్రం బిలిచి "తొల్లి మాతండ్రియగు " రాణాసంగుఁడు తెరచియుంచు మనిన తలుపులు తెరచియే యుంచవలయును; కాని మరల మూయవద్దు. వాని నాలాగుననే యుండనిండు. ఢిల్లీ మండూరు పట్టణములే చిత్తూరునగర ద్వారములగు గాక" యని నొక్కి చెప్పెను. కాని యతఁ డెన్నో కష్టము లనుభవింపవలసివచ్చెను. ఆకష్టములలోఁ గొన్ని స్వయముగ దెచ్చుకొన్నవియుఁ గొన్ని వాని యనుచరుల బుద్ధిహీనత చేతను ద్రోహబుద్ధి చేతను దెచ్చినవియునై యుండె. మొట్టమొదట నతఁను నిగ్రహింపవలసిన ప్రబలశత్రువు వాని సవతితల్లి యగు జవాహీరు భాయి. ఆమె నూరువారు రావుల యాఁడుబడుచు. తనకుఁదోచినంతయెగాని యొకరు చెప్పినట్లు వినక పోవుటయు దురాశచే నెప్పుడు కుట్రల జేయుటయు నామె చేయు ప్రధాన కార్యములై యుండెను. భత౯యగు రాణా సంగుఁడు మృతినొందినతోడనే జవాహీరుభాయి సవతికొడుకును రాజ్యభ్రష్టునిఁ జేయఁదలంచి తనకుమారుఁడు విక్రమజిత్తును చిత్తూరుసింహాసనమునందు నిలుపు మనియు నట్లు చేసిన పక్షమున మున్ను మాళవ దేశపు రాజగు మహమ్మదు చిత్తూరులో విడిచిపోయిన కిరీటమును రంతంబార్ అను కోండకోటను బహుమానములుగ, నిత్తుననియు జేబరు చక్రవతి౯కి రహస్యముగ వత౯మాన మంపెను. బేబరు పనితొందరలోనుండి తెలివి లేక యామెకు బ్రత్యుత్తరమునైన నొసంగక పోవుటచే నామె సంకల్ప మంతరించెను.

ఇది యటుండ రత్నసింగు అంబరుదేశపురాజు కూఁతును వివాహ మాడఁదలఁచి తనకత్తి యక్కడకుఁ బంపి యామెను పెండ్లి చేసికొనెను. వివాహమాడియు నెంత కాలమునకు నామెను దనవద్దకుదీసికోనిరాకపోవుటచే బూందీ సంస్థానాధీపతియగు సురాజమల్లుఁ డా బాలికను వివాహమాడి తన యంతః పురమునకుఁ దీసికొని పోయెను. ఈ కార్యము చేత సురాజమల్లునకును రత్నసింగునకును మనసులలోఁ