పుట:Raajasthaana-Kathaavali.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

రాజస్థానకధావళీ,


గ్రోధాగ్నులు పొడమి రవులుచుండెను. అట్లుండ రత్నసింగొక సాగి వసంత కాలమున నొక యడివిలో వేఁటాడుటకు వచ్చిన సురాజమల్లును నిష్కారణముగఁ బొడిచి యాతని చేత మరల నొకపోటు తిని పగతుని చంపిన సంతోషము లేకుండ తానును జచ్చెను. రత్న సింగు స్వయంకృతాపరాధమునఁ దెగుటచే జవాహీరుభాయియొక్క చిరమనోరధము ప్రయత్న మక్కర లేకయే సిద్ధించెను. విక్రమజిత్తు చిత్తూరు సింహాసన మెక్కెను. విక్రమజి త్తిట్టివాఁడని నిర్ణయించి వ్రాయుటకు వీలు లేదు. రాజస్థానచరిత్ర కారులు వాని యోద్ధ సద్గుణము లేవియు లేవని వ్రాసిరి, బంధువులయెడను సామంతులయెడను నిరాదరణము చూపుటయే గాక యతఁడు నీచులతో సహవాసము చేయుచు రాణా సంగుని కొడు కైనందుకుఁ బ్రజలవలనఁ బొందవలసిన గౌరమును బొందక నిరసింపఁబడుచు వచ్చె. రాజ్య వ్యవహారములను జూడక వస్తాదులను పందెగాండ్రను గలిసి యతఁడు కాలమంతయు 'నేల వ్యథ౯ము చేసినో తెలియదు. ఇట్లు దుస్సహవాసములు చేసి పాడగు చున్నను విక్రమజిత్తు సహజముగ తెలివిగలవాఁ డని యీక్రింది కథ వలనఁ దెలియవచ్చును. ఆతని కాలము వఱకు రాజపుత్ర వీరులు గుఱ్ఱ ముల నెక్కి- కత్తులు బల్లెములు పూని యుద్ధములు చేయుచుండిరి. రాజపుత్రుల శత్రువులు తుపాకులను ఫిరంగులను బూని యుద్ధము సేయుచు వచ్చిరి. అందుచేత రాజపుత్రులు తరుచుగ నోడిపోవుటయు మహమ్మదీయులు గెల్చుటయు సంభవించెను.

విక్రమజిత్తు బుద్ధిశాలి యగుటచే రాజపుత్రు లెంతశూరులైనను నిప్పులఁ జిమ్ము ఫిరంగులు మొదలగు నాయుధములు లేక వట్టి కత్తులు కఠారులు బూని గుఱ్ఱముల పై నెక్కి యుద్ధము చేసినంత మాత్రమున గెలువఁజాల రని నమ్మి ప్రాత పద్ధతిని విడిచి క్రోత్త పద్ధతిప్రకారము నూతనాయుథములను బూనవలసినదని 'తన వారి నందఱిని బురికోల్పెను. క్రోత్త పద్ధతి యనఁగా రాజపుత్రశూరులు యుద్ధరం