పుట:Raajasthaana-Kathaavali.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు రెండవముట్టడి.


కణ్వాహా యుద్ధమైన తరువాత పాడుపడినస్థలములు బాగుచేసి కొనుటకును మరల ఫూటుపడుటకును రాజస్థానమునకుఁ గొంత విశ్రాంతి కలిగినది, ఎవఁడో యొక వీరుఁడు మృతినొందని కుటుంబము గాని గృహము కాని లేకపోవుటచే రాజస్థానమం దంతట శోకదేవత విహారము చేయుచున్నట్టు కనఁబడెను. ఆదారుణ యుద్ధమైన తరువాత గలిగిన విశ్రాంతిచే రాజపుత్ర స్త్రీలు తమ మగవారలకు జరిగిన పరాభవపు మచ్చను దుడిచి వేయఁగల శూరులగు కుమారులను గని పెంచుచుండిరి.

రాణాసంగుఁడు పోయిన రెండు సంవత్సరములకే బేబరు చక్రవర్తియుఁ గాలధర్మము నొందుటచేఁ గ్రోత్తగా జయించిన భూములన్నిటిని గలియఁ గట్టుకొని సంరక్షించు కొనుభారము వాని కుమారుఁడగు హుమాయూను పైఁ బడెను. హుమాయూను ధైర్యశాలియు సౌదార్యవంతుఁడు నై స్వగౌరవముఁ గాపాడుకొను విషయమున రాజపుత్రు లెంత తీవరముగా నుందురో యంత తీవ్రముగ నుండి దయాళువై సర్వజనులచేతఁ బ్రేమింపఁబడుచు వచ్చెను. రాచరికమున కుండవలసిన కాఠిన్యము మనో ధైర్యము చిత్త నైర్మల్యము మొదలగు గుణములు లేకపోవుటయేగాక తొల్లి వానితండ్రి 'కభ్యాసములైన నల్లమందు మద్దతు మొదలగునవి వాని కలవడెను. అందుచే నతఁడు స్థిరబుద్ధి లేనివాఁడై బేబరువలె నలుదెసలం జెదిరియున్న రాజ్యమును కూడగట్టుకోని పాలింప లేకపోయెను.

అదియటుండ రాణాసంగుని జ్యేష్ఠపుత్రుఁడు రత్నసింగు రాజపుత్రకులజులవద్ద నుండు శౌర్యగాంభీర్యాది సమస్త లక్షణములు గలిగి తండ్రి పరోక్షమున రాజ్యమునకు వచ్చెను. గద్దె యెక్కినతోడనే