పుట:Raadhika Santhvanamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యగత్య మేమి? మీఁదు మిక్కిలి నాయాసామియుఁ దంజావూరు కవియే యఁట. మఱి తల్లిపుట్టుక మేనమామ యెఱుఁగకుండునా? కాఁబట్టి యా కీలక 1728 యని నిశ్చయించుటయే సమంజసము. అది విజయరంగని రాజ్యపాలన కాలమునఁ బడినది. అప్పటికప్పుడై సముఖముకృతి ప్రతిష్ఠ తంజావూరునకును బ్రాకిన దన్నమాట. దానికి రంగశాయికొమార్త తంజావూరు కవిచేఁ బ్రతి వ్రాయించుకొనుటయే తార్కాణ. సముఖము రాధికాసాంత్వనము విజయరంగని పరిపాలన కాలముననే రచింపఁబడె ననుట కందలి ‘ఇది శ్రీపాండ్యమండలాధీశ్వర—శ్రీవిజయరంగ చొక్కనాథ మహీనాథ కరుణాకటాక్షసంపాదిత....’ అను నాశ్వాసాంతగద్యయే ప్రబలాధారము. అసలు సముఖము గ్రంథరచన మంతయు విజయరంగని రాజ్యకాలముననే సాగినది. అతని ప్రతి గ్రంథాంతగద్యలోను విజయరంగని పేరు కనిపించును. ఆ గద్యయు నన్నింట నొక్కతీరుగనే యున్నది.

ఇఁక నీ రాధికాసాంత్వనము సముఖము కృతమే యనుట కాధారములు: సమకాలికుఁడైన కవి యొకఁడు ప్రతి వ్రాయుట, గ్రంథావతారికలోని

‘వెలయ నభీష్ట మిమ్మనుచు వేంకటకృష్ణ నృపాలశేఖరుం
డిల రసికావతంసులకు హృద్యముగా మృదుమాధురీరసా
కలిత చమత్క్రియాకలన కల్పనగా రచియింపనొప్పు ని
శ్చలమగు రాధికారమణి సాంత్వనమున్ గృతి సల్పుమని చనెన్.’

అను పద్యమును, అహల్యాసంక్రందనము నందును నిందును నచ్చముగా నొక్కతీరుగ నున్న గ్రంథాంతమందలి