పుట:Raadhika Santhvanamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన కిప్పు డుపలభ్యము లగు రాధికాసాంత్వనములు రెండు. సముఖము కృతి యొకటి, ముద్దుపళని దొకటి. ఇరువురి కవితలకును బోలిక లిరుగుపొరుగుగా నున్నవి. పద్యము లఱువది పైచిలుకు రెండింట యథాతథముగా నున్నవి. సముఖము క్రీ.శ. 1704-1731 సం.ల మధ్య మథుర నేలిన విజయరంగ చొక్కనాథనాయకుని ముఖ్యసామాజికుఁడు. ముద్దుపళని క్రీ.శ. 1741-1764 సం.ల మధ్య తంజావూరు నేలిన మహారాష్ట్రప్రభువు ప్రతాపసింహుని నాస్థానిని. విజయరంగని రాజ్యకాలమునకే వేంకట కృష్ణప్ప వృద్ధుఁడై యుండె నను యూహకు నుపాధి గలదు. (చూ. ఆం.సా.ప. ప్రచురణ వచన జైమిని భారతమునకు జయంతి రామయ్యగారి భూమిక) ఎంత కాదన్నను నిరువురకును బది పదునైదేండ్లైన నంతర ముండి యుండును. అదియుఁ గాక యాంధ్ర సాహిత్య పరిషత్తునఁ గల సముఖము కృతి తాళపత్త్రప్రతిచివర, ‘కీలకనామ సంవత్సర మార్గశీర్ష బహుళషష్ఠి శుక్రవారమునాఁడు బాగూరు రంగశాయి కొమార్త అమ్మికి తంజావూరికవి వేంకటస్వామినాయఁడు రాధికాసాంత్వనము సర్వు స్వహస్తలిఖితముగా నిచ్చినది’, యని గలదు. ఆ కీలకనామ సంవత్సరము క్రీ.శ. 1728గా గుర్తింపబడినది. అది 1788 యైనను గావచ్చును. కాని యట్లయినచోఁ బ్రతాపసింహుని కాలమున ననఁగా నంతకు (1788 నాఁటికి) అథమపక్ష మిఱువదినాలుగేండ్లకు (1764 నకు) బూర్వమే రచింపబడియుండు ముద్దుపళని కృతిని గాదని, లేఖకుఁడు వేంకటస్వామి యా రంగశాయి కొమార్త యెవర్తకో సముఖముకృతికిఁ బ్రతి వ్రాసి యీయవలసిన