పుట:Punitha Matha.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవమాత కనుకనే మనకు సహరక్షకి కాగలిగింది.

క్రీస్తు ఉత్థానమై మోక్షారోహణం చేశాడు. క్రీస్తు రక్షణకార్యంలో పాల్గొనిన రక్షణమాతకు గూడ ఉత్థాపనం లభించింది. ఉత్థానక్రీస్తు మనకు వరప్రసాదం ఆర్జించిపెట్టాడు. ఆ వరప్రసాదాన్ని రక్షణమాత మనకు పంచి పెడుతూంటుంది. ఆమె వరప్రసాదాలమాత.క్రీస్తుతో పాటు ఆమె కూడ నిత్యం మనకోసం మనవి చేస్తుంటుంది. క్రీస్తుకు భౌతిక మాతయైన మరియ క్రీస్తు దేహమైన శ్రీసభకు జ్ఞానమాత ఔతుంది. ఆమె రెండవయేవ. జీవమిచ్చే యేవ. కనుక మరియ దైవమాతృత్వమే ఆమె ఉత్థాపనానికీ, వరప్రసాద ప్రదానానికీ, జ్ఞాన మాతృత్వానికీ కారణం అని చెప్పాలి.

క్రీస్తు తన తండ్రి సమక్షంలో కూర్చుండి రాజుగా పరిపాలన చేస్తుంటాడు. మరియు గూడ ఆ క్రీస్తుతోపాటు తానూ రాజ్జిగా పాలనం చేస్తుంది. మన తరపున ఆమె చేసే వేడుదలే ఆమె రాచరికం. మరియ రాజ్జీత్వంకూడ ఆమె దైవమాతృత్వంయొక్క ఫలితమే. ఈ విధంగా మరియు మూత మంగళగుణాలన్నీ ෂධීය దివ్యమాతృత్వం వలననే సిద్ధించాయని చెప్పాలి. కనుక దేవుడు తన రక్షణ ప్రణాళికలోనే ఆమెను దేవమాతనుగా ఎన్నుకున్నాడు.

2. మరియ - శ్రీసభ

మనుష్యావతారం అంటే దేవుడు నరుడు గావడం మాత్రమే గాదు, నరులు ఆ దేవుని దేహంగావడం కూడా. అనగా క్రైస్తవసమాజం లేక శ్రీసభ ఏర్పడ్డం గూడ. ఈ శ్రీసభలో మరియ మొదటి వ్యక్తి కనుక ఆమె శ్రీసభ కంతటికీ మాతృకగా, ఆదర్శంగా వుంటుంది. ఇక మానుష క్రీస్తునకు అతని తల్డిక్షీప్రిలాంటి మహిమాన్విత లక్షణాలు