పుట:Punitha Matha.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమీపింప బోతున్నాడు. అతన్ని మన మానుష కుటుంబంలో ప్రవేశపెట్టబోయే తల్లీ పవిత్రురాలై యుండాలి. సూర్యుడు భూమిమీద పడేట్లయితే ఆ భూమిని చేరకముందే నేలమీద తాను పడబోయేచోటిని కాల్చివేస్తాడు. అలాగే దేవుడు కూడ తాను మానవ సమాజంలోకి దిగిరాక ముందే, ఏ వ్యక్తి ద్వారా అలా దిగిరానున్నాడో ఆ వ్యక్తిని తన ప్రేమాగ్నితో కాల్చి పునీతం జేశాడు. అందువలననే ఆమె నిష్కళంకంగా జన్మించింది. నిష్కల్మషుడైన దేవునికి పుట్టువు ఈయడం కోసం మరియ నిష్కల్మషంగా ఉద్భవించింది.

మరియ నిత్యకన్య అన్నాం. దేనికి? తన పూర్ణ హృదయాన్ని ప్రభువుకే సమర్పించుకోవడం కోసం. కన్య మరియ తన హృదయాన్ని దేవుడైన తన కుమారునికే అర్పించుకుంది. మరో కుమారుడు ఆమెకు పుట్టనూలేదు, ఆ తల్లి ప్రేమలో పాలుపంచుకోనూలేదు. కనుక ఆమె కన్యత్వం గూడ దైవమాతృత్వం కోసమే.

మరియు సహరక్షకి అన్నాం. ఆమె దేవమాత కనుకనే సహరక్షకి ఐంది. దేవుని కుమారుని కని అతనికి మానుష దేహం ఇచ్చింది. ఈ దేహాన్నే క్రీస్తు సిలువమీద బలిగా అర్పిస్తాడు. అనగా ఆమె క్రీస్తుకు బలివస్తువును అందించింది. క్రీస్తును బలిమూర్తిగా సిద్ధం చేసింది. అటుపిమ్మట మరియ సిలువచెంత నిలుచుండి బాధననుభవిస్తూ క్రీస్తును అర్పించింది. క్రీస్తు స్వీయార్పణంతో తన ఆత్మార్పణను కూడా ఐక్యం చేసింది. ఈ సన్నివేశంలో సిలువ చెంత నిలిచిన మరియు మానవు లందరికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక, ఆమె సహకారం ద్వారా క్రీస్తు రక్షణం మరింతగా మానవులనుండి పట్టే రక్షణమైంది. మానవుణ్ణి మానవుడే రక్షించుకోవడం దైవపత్రాళిక అన్నాంగదా! ఈలామరియ