పుట:Punitha Matha.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంపగోరాడు. ఇక ఈ దేవుణ్ణి నరుణ్ణి జేసి మన సమాజంలోనికి తీసికొని రాదగిన తల్లి ఒకర్తె వుండాలి. దేవుడు ఎన్నుకున్న అతల్లె మరియ. ఈ యధ్యాయంలో రెండంశాలు విచారిద్దాం. మరియ మంగళ గుణాలన్నిటికీ ఆమె మాతృత్వమే ఆధారం. మరియ మంగళ గుణాలన్నీ శ్రీసభకూ, అనగా మనకూ, అక్షరాలా వర్తిస్తాయి.

1. దైవ సంకల్పంలో మరియ

అనాదినుండి దేవుని రక్షణ ప్రణాళికలో క్రీస్తు ఉన్నాడు. మరియ మాతా వుంది. క్రీస్తు దేహం గాబోయే శ్రీసభా వుంది. మరియద్వారా గాని దేవుడు మానవసమాజానికి తన కుమారుణ్ణి ప్రసాదించలేడు. ఆమె ద్వారా గాని పరలోకపిత మానవ సమాజంతో రక్షణ సంబంధం పెట్టుకోలేడు. సరే, భగవంతుని కోరిక ప్రకారం మరియు దేవుని కుమారుణ్ణి నరుణ్ణిజేసి మన మంటిమీదికి ప్రవేశపెట్టింది. ఈ మహత్తర కార్యం ద్వారా ఆమె దేవమాత ఐంది. మరియు గుణాలన్నిటలో శ్రేష్టాతి శ్రేష్టమైంది ఈ దైవ మాతృత్వమే. ఆమె గొప్పతనమంతా ఈ లక్షణం మీదనే ఆధారపడివుంది.

ఈ మరియ రక్షిత మానవ సమాజంలో మొదటి వ్యక్తి రక్షిత మానవసమాజమే శ్రీసభ, క్రీస్తుదేహం. కనుక శ్రీసభకు మరియు ఆదర్శంగా వుంటుంది. పూర్వాధ్యాయాల్లో కన్యత్వం, నిష్కళంకత్వం మొదలైన మరియ భాగ్యగుణాలను విచారించాం. ఈ భాగ్యగుణాలన్నీ ఆమె దైవమాతృత్వాన్ని బట్టి సిద్ధించినవే. ఈ విషయాన్ని కొంత సవిస్తరంగా విచారించి చూద్దాం. మరియు దేవమాత కావాలి గనుకనే నిష్కళంకగా జన్మించింది. పరమ పవిత్రుడైన దేవుడు ఈ హో ద్వారా పాపపు నరజాతిని