పుట:Punitha Matha.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంబలనూ, కన్యలనూ గౌరవించే హిందూ ప్రజలను, హృదయశుద్ధితో భగవంతుని వెదికే జనులందరినీ ఆ తల్లి తన చెంతకూ తన కుమారుని చెంతకూ చేర్చుకోవాలని మనవి చేద్దాం. చేర్చుకుంటుందని ఆశిద్దాం.

3. ముస్లిముల సంప్రదాయం

హిందువుల్లాగే ముస్లిములు చాలమంది గూడ మరియను గౌరవిస్తుంటారు. మరియమాత గుళ్లకువెళ్లి ఆమెను పూజిస్తూంటారు. కొరాను ప్రకారం మరియు పాపం లేకుండా జన్మించింది. పవిత్రురాలు. కన్యగానే బిడ్డను కంది. ఆ గ్రంథం ఓ తావులో "ఓ మిరియం! దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. పవిత్రపరచాడు. ప్రపంచంలోని స్త్రీలందరి కంటె గూడ నిన్ను ధన్యురాలినిగా జేశాడు" అంటుంది -3,41. కాని కొరాను క్రీస్తుని ఓ ప్రవక్తగానే గాని దేవునిగా అంగీకరింపదు. కనుక మరియను గూడ దేవమాతగా అంగీకరింపదు. ఇప్పుడు ముస్లిము దైవశాస్త్రజ్ఞల్లో చాలమంది కూడ నిష్టతో బైబులు చదువుతూన్నారు. అసలు ఆత్మశక్తి వల్ల అన్ని మతాలూ సమైక్యమైపోతూన్న రోజులివి. కనుక ఆ తల్లి ముస్లిము సోదరులను గూడ క్రీస్తు చెంతకు చేర్చాలని ప్రార్థిద్దాం.

13. మరియు మాత - శ్రీసభ

దేవుడు ప్రేమమూర్తి. అతడు ముగ్గురు వ్యక్తులతో గూడిన సమాజం. దేవుడు తన ప్రేమను మానవ సమాజానికి అందించా లనుకున్నాడు, అందించాడు. కాని నరుడు దేవుని (పేమను ధిక్కరించాడు, పాపం కట్టుకున్నాడు. ఐనా భగవంతుడు కరుణతో పాపపు నరజాతిని రక్షింపబూనాడు. కాని నరజాతి రక్షణ నరజాతినుండే రావాలన్న తలంపుతో దేవుడు తన కుమారుణ్ణి నరుణ్ణిగా