పుట:Punitha Matha.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
2. మరియను ఈలా యెందుకు పదిలపరచాలి?

దేవుడు మరియను జన్మపాపం నుండి కర్మపాపం నుండి పదిల పరచాడన్నాం. ఎందుకు? తన తల్లిని తాను ఎన్నుకున్న నరుడు ఒక్కడే ఒక్కడు, క్రీస్తు ఈలా తానెన్నుకున్న ప్రీని క్రీస్తు తనకు యోగ్యమైన మాతనుగా తయారుజేసుకన్నాడు. తల్లి కళంకం బిడ్డకు సోకుతుంది అంచేత జన్మాదినుండీ ఆమె యందు కళంకం ఉండకూడదు. దేవదూత ఆమెకు మంగళవార్త చెపూ "దైవానుగ్రహానికి ప్రాప్మరాలవైన మరియా! నీకు శుభం" అంటాడు -లూకా 1,28. అనగా ఆమె పుట్టువునుండి దైవానుగ్రహంతో నిండివుండేదనే భావం. ఈలాంటి తల్లి మరియు. ఈ తల్లివలన క్రీస్తుకు చిన్నతనం కలుగలేదు. అందుకే శ్రీసభ ప్రార్ధనలో ఉపయోగింపబడే ఓ గీతం క్రీస్తునుద్దేశించి "ప్రభూ! నీవు కన్యగర్భాన్ని అనాదరం చేయలేదు" అంటుంది. చక్కని ఇల్లు గట్టించి శత్రువుకిచ్చి వేయం. ప్రభువూ తన చక్కని తల్లిని, పిశాచం వశంజేసి పాపకళంకితను జేయడు. మంచి గొర్రెపిల్లను ఈనిన గొర్రె మంచి గొర్రె. అలాగే పవిత్ర క్రీస్తును మనకందించిన మరియమాతగూడ పవిత్రురాలే.

బైబులు భగవంతుడు పరిశుద్దుడు. అపవిత్ర ప్రాణి ఏదికూడ అతని సముఖంలోకి రాలేదు. ఇక మరియు పవిత్రుడైన దేవుణ్ణి మన మానుష కుటుంబంలోనికి తీసికొని రావాలి. కాని ఆమె అపవిత్రురాలైతే క్రీస్తు గర్భంలో అడుగు పెడతాడా? అంచేత ఆ దేవునిలాగే ఆమెకూడ పరిశుద్ధురాలు కావాలి గదా? కనుకనే పిత ఆమెను ఓ దేవాలయంలాగా పరిశుద్ధపరచాడు. మరియ దేహాత్మలను పవిత్రపరచి ఆ మాతృమూర్తిని క్రీస్తుకు యోగ్యమైన వాసస్థలమయ్యేలా తీర్చిదిద్దాడు. ఆ మంగళమూర్తి