పుట:Punitha Matha.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అబ్బిన భాగ్యం మనకబ్బలేదు. ఈ రక్షణ ఫలితంగా ఆమెకు జన్మపాపమూ సోకలేదు, కర్మపాపమూ సోకలేదు. కర్మపాపరూపమైన చావైన పాపం గానీ స్వల్ప పాపంగానీ ఆమెకు కళంకం ఆపాదించలేదు. ప్రభువు ఆమెను నీతి వస్రంతో ఓ వధువునులాగ అలంకరించాడు. వరప్రసాదలనే ఆభరణాలతో కైసేసాడు. మరియు దేవదూతలకంటె పునీతుల కంటెగూడ అధిక వరప్రసాదాలతో నిండిపోయింది. కావుననే శ్రీసభ తన ఆరాధనలో ఆ నిర్మలహృదయను కొనియాడుతూ "ఓ మరియా! నీవు పరిపూర్ణ సౌందర్యవతివి. పాపదోషం నీకేమాత్రమూ సోకలేదు" అంటూ పరమగీత వాక్యాన్ని ఆమెకు అన్వయింప జేస్తుంది4, 1 ఏప్రేమ అనే నాల్గవ శతాబ్దపు భక్తుడు క్రీస్తునుద్దేశించి "ప్రభూ! నీలో పాపదోషమంటూ లేదు, మీ తల్లిలో కల్మషమంటూ లేడు” అని వాకొన్నాడు.ఆ భక్తుడే మరో తావులో "దైవవార్త దైవవక్షస్సును వీడి కన్యవక్షస్సు నాశ్రయించి మానవరూపం చేకొంది. ఆ దైవవక్షస్సులాగే ఈ కన్యవక్షస్సు కూడ పరమపవిత్రమైంది. ఇక నేడు మన వక్షస్సున వసించే ప్రభువు స్తుతింపబడునుగాక” అంటాడు. కనుక మరియ పరమపవిత్రురాలు. పాపము నుండి పదిలపరచబడిన పునీతురాలు. ఎన్మిదవ శతాబ్దం నాటికే క్రైస్తవ ప్రపంచంలో నిష్కళంకమాత ఉత్సవం ప్రచారంలోఉండేది. 18వ శతాబ్దంలో డన్స్సోటస్ అనే దైవశాస్త్రజ్ఞడు మరియ నిష్కళంకగా జన్మించిందని రుజువుపరచాడు. 1854లో పదవ భక్తినాథపోపుగారు మరియ నిష్కళంకగా ఉద్భవించిందని అధికార పూర్వకంగా ప్రకటించారు.