పుట:Punitha Matha.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుని తన హృదయంలో నిలుపుకున్న ఓ పవిత్ర దేవాలయం. "ప్రభూ నీ మందిరానికి పారిశుధ్యం తగివుంటుంది" అంటాడు కీర్తనకారుడు93,5. ఔను, మరియకు పారిశుధ్యం తగివుంటుంది.

మరియు పిశాచం తలను చితుకగొట్టబోతుంది -ఆది 8, 15. ఈలా సైతానుని జయించే కన్య తానే పాపం ద్వారా ఆ సైతానుకి దాసురాలు కాకూడదు గదా? కనుక ఆమెకు పుట్టువునుండీ పాపం సోకలేదు.

దేవదూత ఆ మరియతో "పవిత్రాత్మ నీ మీదికి దిగి వస్తుంది. మహోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది" అంటాడు-లూకా 1,36. ఈ దివ్యాత్ముడు చాల గొప్పశిల్పి, గొప్ప చిత్రకారుడు. చిత్రకారుడు సుందరిని చిత్రించినటుగా వరిశుద్ధాత్ముడు తన వధువైన మరియమాతను సుందరంగా, పవిత్రంగా తీర్చిదిద్దాడు. ఆమెను అన్ని అలంకరణలతో, అన్ని సౌభాగ్యాలతో, అన్ని పుణ్యాలతో ఓ నిర్మల వధువునులాగ అలంకరించాడు. కావుననే ఆ కన్య పాపకళంకం సోకని సంపూర్ణ సౌందర్యవతి. దేవుడు మరియమాతను పాపం నుండి పదిలపరచడంలో, ఓ కళ్యాణమూర్తినిగా ఆమెను తీర్చి దిద్దడంలో భావం యిది.

3. నిష్కళంకమాత మహిమ

జన్మ కర్మపాపాల నుండి విముక్తమైనందున మరియమాతకు సిద్ధించిన మహిమ అంతింతకాదు. ఆమె పితకు ప్రియ కుమారి, సుతునకు ప్రియజనని, పరిశుద్ధాత్మనకు ప్రియ వధువు ఔతుంది. పాపపు ప్రపంచానుండి వైదొలగి పవిత్రుడైన భగవంతునికి అంకిత