పుట:Punitha Matha.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని క్యాథలిక్ క్రైస్తవులు దీనినంగీకరింపరు. వాళ్ల ప్రకారం యథార్థ మధ్యవర్తియేమో క్రీస్తే. కాని యీ మధ్యవర్తి మానవ మధ్యవర్తులను గూడ తనతో జోడించుకొనే తన మధ్యవర్తిత్వాన్ని నెరపాడు. నరుని నరుడే రక్షించుకోవాలి అని దేవుని ఆశయం. కనుకనే దేవుడు నరుడై జన్మించింది. ఈలా నరుడైన దేవునితో మరియు కూడ కలసిపోతుంది. దేవుని మధ్యవర్తిత్వం నరుల మధ్యవర్తిత్వాన్ని నిరాకరించదు. కరుణతో తనతోగూడ చేర్చుకొంటుంది. ఈలా చేర్చుకోవడం అవసరమైకాదు, ఔచిత్యం కోసం. కనుక మరియ క్రీస్తు చెంత నిలిచి అతని మధ్యవర్తిత్వానికి సాక్ష్యంగా వుండి పోవటం మాత్రమే గాదు, తాను స్వయంగా మన మధ్యవర్తిని గూడ.


ప్రొటస్టెంటు నాయకులు మొదటిరోజుల్లో మరియమాతను గూర్చి చాల విషయాలు అంగీకరించారు. లూథరుకి ఆమెపట్ల చాల భక్తీ అభిమానమూ వుండేవి. కాని క్రమేణ ప్రొటస్టెంటు శాఖలు "బైబులు మాత్రమే, దేవుడు మాత్రమే, వరప్రసాదం మాత్రమే" అనే వాదాన్ని లేవదీశారు. ఈ వాదం ప్రకారం బైబులులోలేని క్రైస్తవమత ఆధారాలన్నీ పోయాయి. కనుక పారంపర్యబోధ పోయింది. దేవుడు గాని పునీతులంతా పోయారు. వాళ్లతో బాటు మరియమాత కూడ పోయింది. వరప్రసాదం కానిదంతా పోయింది. అనగా నరుల సహకారం గూడ పోయింది. ప్రొటస్టెంటులు మరియమాతను తూలనాడ్డం మొదలెట్టారు. అది చూచి క్యాథలిక్కులు ఆమెను అత్యధికంగా స్తుతించడం మొదలెట్టారు. ప్రొటస్టెంటులు ఆమెను పూజించడానికి ఆస్కారమేమిటి అన్నారు. క్యాథలిక్కులు పారంపర్య