పుట:Punitha Matha.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధ అన్నారు. ప్రొటస్టెంటులు ఆమెను కొనియాడితే క్రీస్తు మధ్యవర్తిత్వం పోతుంది అన్నారు. క్యాథలిక్కులు పోదు, ఇంకా అర్ధవంతమౌతుంది అన్నారు. ఈలా నిన్న మొన్నటి వరకూ ఈ ఉభయశాఖల వాళూ పోట్లాడుకొంటూనే వచ్చారు. క్రైస్తవులను ఐక్య పరచవలసిన తల్లి ఈలా వాళ్ల విభజనకు కారణం కావడం చాల దురదృష్టం.

వాటికన్ మహాసభ మొదట మరియమాత మీదగూడ చట్టం తయారుచేసింది. కాని ఆ చట్టం వలన ప్రొటస్టెంటులను రెచ్చగొట్టినట్ల వుతుందని మళ్లా దాన్ని ఉపసంహరించుకొంది. అందలి ముఖ్యాంశా లను శ్రీసభను గూర్చిన చట్టంలోనే ఓ అధ్యాయంగా చేర్చింది. ఈ సభ మరియు మాతకు "మధ్యవర్తిని" అనే బిరుదం కూడ కొంచెం జంకుతూనే గాని వాడలేదు. అలా వాడిన తావుల్లో గూడ "మరియమాత మధ్యవర్తిత్వం క్రీస్తుమధ్యవర్తిత్వానికి ఏమీ చేర్చదు. ఆ మధ్యవర్తిత్వం నుండి ఏమీ తొలగించదు" అని స్పష్టంగా చెప్పింది.

వాటికన్ ధోరణి ఈలా వుండగా మరియమాతను గూర్చిన ప్రొటస్టెంటు దైవశాస్రజ్ఞల దృష్టికూడ ఇటీవల చాలవరకు మారిపోయింది. వాళ్లు బైబులును జాగ్రత్తగా చదివి మరియు స్థానాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఉభయ వర్గాల నుండి సమైక్యతా భావాలు పుట్టుకవస్తున్నాయి. మరియమాత క్రైస్తవశాఖలకు ఐక్యత ప్రసాదించాలి ෂරඹී మొదట ఈ శాఖలవాళ్లు కొన్ని నూతృదృక్పథాలు అలవరచుకోవాలి. ప్రొటస్టెంటులు క్యాథలిక్కులు కూడ తమ వైఖరిని మార్చుకోవాలి. ప్రొటస్టెంటు శాఖలవాత్తు బైబులే కాకుండా పారంపర్య