పుట:Punitha Matha.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనుకొన్నాడు అంతే - మత్త 1, 19. అనగా ఆమె పట్ల అతనికి ఎంతో గౌరవముండేది. ఆమె యోగ్యురాలనే అతని భావం. అలాగే మరియకూడ యోసేఫుని గౌరవాదరాలతో చూచేది. బాలయేసు కన్పించకుండా బోయి మళ్లా దేవాలయంలో కంటపడ్డప్పుడు ఆమె “బాబూ! నీవెక్కడున్నావు? మీనాన్న నేను పుట్టెడు దుఃఖముతో నీకోసం వెదకుతున్నాం గదా!" అంది - లూకా 2,48. ఈ వాక్యాన్ని బట్టే ఆమెకు భర్తపట్ల వున్న గౌరవం వెల్లడి ఔతుంది. కుటుంబ జీవితంలో ఆలుమగలు ప్రేమభావం తోను పరస్పర గౌరవంతోను జీవించడానికి మరియు ఆదర్శంగా వుంటుంది. తాను గృహస్థప్రజలకు ఆ వరప్రసాదాన్ని ఆర్జించిపెడుతూంది గూడ.

తల్లిదండ్రులు పిల్లలను కని పెంచడం గూడ గొప్పబాధ్యత. మరియ క్రీస్తుబిడ్డను కని అనురాగంతో పెంచింది. యూదమత నియమాల ప్రకారం ఆ బిడ్డకు జరిపించవలసిన ఆచారాలన్నీ జరిపించింది. యెరూషలేము యాత్రా సందర్భంలో కుమారుణ్ణి కోల్పోయినప్పడు ఆమెకు కడుపు తరుగుకొని పోయింది. ఇక, ఆ కుమారుడు కూడ తల్లిదండ్రులకు విధేయుడై వర్తించాడు -లూకా 1,51. మన కుటుంబాల్లో తరచుగా తల్లిదండ్రులకూ బిడ్డలకూ మధ్య బోలెడన్ని చిక్కులూ అపార్థాలూ వసూంటాయి. ఈ వటున తల్లిదండ్రులకు తిరుకుటుంబవేు ఆదర్శం. మరియు వున తల్లిదండ్రులకూ బిడ్డలకూ గూడ పరస్పర ప్రేమతో జీవించే భాగ్యాన్ని ఆర్జించిపెడుతుంది. గృహిణికి దైవభక్తి చాలముఖ్యం. ఆమె భక్తురాలైతే కుటుంబమంతా భక్తిమంతంగా మెలుగుతుంది. మరియు ఈలాంటి